Thursday, May 9, 2024
- Advertisement -

నారా రోహిత్ హిట్ కొట్టేసాడు

- Advertisement -

తెలుగులో యువ కథానాయకులకు రెండు విషయాల్లో ఆదర్శంగా నిలిచాడు నారా రోహిత్. వైవిధ్యమైన కథలు ఎంచుకోవడం ఒకటైతే.. మరో విషయం అనవసర హంగులు లేకుండా తక్కువ బడ్జెట్లో.. శరవేగంగా సినిమాలు పూర్తి చేయడం. ఐతే అతడి ప్లానింగ్.. కథల ఎంపిక బాగానే ఉన్నప్పటికీ.. అతడి గత సినిమాలు నిరాశ పరిచాయి.

వేసవిలో నెలన్నర వ్యవధిలో వచ్చిన రోహిత్ మూడు సినిమాలూ అంచనాల్ని అందుకోలేకపోయాయి. అంతకుముందు అసుర.. రౌడీఫెలో.. ప్రతినిధి మంచి కంటెంట్ ఉన్న సినిమాలే. పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ అవ్వాల్సినంత పెద్ద హిట్లయితే కాలేదు. ఐతే సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రోహిత్ కు ‘జ్యో అచ్యుతానంద’ వరంలా మారేలా కనిపిస్తోంది.శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రాజమౌళి సహా సినీ ప్రముఖులందరూ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ‘జ్యో అచ్యుతానంద’ గురించి పెద్ద చర్చే నడుస్తోంది.

సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజే ఉంది కానీ.. విడుదల తర్వాత అది ఇంకా పెరిగింది. సినిమా అనుకున్న దానికంటే పెద్ద విజయం సాధించేలా కనిపిస్తోంది. మంచి టేస్టున్న నిర్మాతగా గుర్తింపున్న సాయి కొర్రపాటికి కూడా గత కొంతకాలంగా సరైన విజయాల్లేవు. తుంగభద్ర.. రాజా చెయ్యి వేస్తే దెబ్బ తీశాయి. తాజాగా ‘మనమంతా’కు మంచి పేరొచ్చినా డబ్బులు రాలేదు. ఈ నేపథ్యంలో ‘జ్యో అచ్యుతానంద’ ప్రశంసలతో పాటు డబ్బులూ తెచ్చిపెట్టేలా ఉంది. పెట్టుబడి మీద బాగానే లాభాలు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రెజీనా.. నాగశౌర్య.. కళ్యాణ రమణలకు కూడా ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరం. అవసరాల కూడా ద్వితీయ విఘ్నాన్ని అధిగమించినట్లే అన్నమాట.  మొత్తానికి చాలామంది కెరీర్లకు ‘జ్యో అచ్యుతానంద’ కీలక మలుపులా మారేట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -