Monday, May 6, 2024
- Advertisement -

రేవంత్‌ రెడ్డి సహా కీలక నేతల అరెస్ట్‌

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వకర్మపై పోలీసులు కేసు నమోదు చేయనందుకు నిరసనగా నేడు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోని అన్ని పోలీసు స్టేషన్లను ముట్టడించేందుకు పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు కాంగ్రెస్‌ పార్టీలోని కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. హిమంత బిశ్వకర్మ వ్యాఖ్యలకు నిరసనగా ఆపార్టీ తెలంగాణ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ కమిషనరేట్‌ ఎదుట, మరో నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాచకొండ కమిషనేట్‌ వద్ద ధర్నాకు దిగాలని నిర్ణయించారు. దీంతో రేవంత్‌తో సహా పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌లో జరిపిన సర్జికల్‌ స్ట్రైక్‌కు ఆధారాలు చూపించాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన బిశ్వకర్మ రాహుల్‌ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కుమారుడు అనేందుకు కూడా ఆధారాలు చూపించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -