Friday, April 26, 2024
- Advertisement -

ఇదే అవకాశం.. చిచ్చు పెట్టండి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు?

- Advertisement -

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అడ్డదారులు తొక్కేందుకు సిద్దమయింది. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయి, మున్ముందు కూడా అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో తెలుగు తమ్ముళ్లంతా నీరసించిపోయారు. పంచాయతీ బరిలోకి దిగేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారట. పోటీలో నిలబడి రచ్చ చేయాలని కుట్రపూరిత సలహాలు ఇస్తున్నారు.

విజయావకాశాలు లేకపోయినా టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో రచ్చచేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడి అధికార పార్టీ మీద నెపం నెట్టేయాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి వరకు పార్టీ కీలక నేతలతో చంద్ర బాబు చర్చలు సాగించినట్లు తెలిసింది.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆశాజనకంగా లేదని, కొన్ని చోట్ల నామినేషన్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని పలువురు నేతలు అధినేతకు వివరించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో తాను తలెత్తుకోలేనని, టీడీపీ తరఫున నామినేషన్‌కు ఎవరూ లేని పంచాయతీల్లో పార్టీకి సంబంధం లేని వ్యక్తులను పోటీకి దింపేందుకు యత్నించాలని తెలుగు తమ్ముళ్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్‌ తమకు అనుకూలంగా ఉన్నారని, గొడవలు చేసి, గందరగోళం సృష్టించి ప్రయోజనం పొందాలని సూచించినట్లు సమాచారం. గొడవ చేసి వైఎస్సార్‌ సీపీ నేతలపై నిందమోపేలా వీడియెలు తయారుచేసి పంపించాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

కాగా, ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో (జనవరి 31)ముగిసింది.ఫిబ్రవరి 9న పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న రెండో దశ, 17న మూడో దశ, 21న నాల్గో దశ ఎన్నికలను జరగనున్నాయి.

సొంత జిల్లాలో చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం!

బూటకపు ఎన్నికలను బహిష్కరించండి

సూపర్‌ స్టార్‌తో చిందులేసేందుకు రెడీ అయిన బిగ్‌బాస్‌ బ్యూటి

ఎమ్మెల్యే రోజాకు ఇష్టమైన సినిమా ఏదో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -