Saturday, April 27, 2024
- Advertisement -

సొంత జిల్లాలో చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం!

- Advertisement -

మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డిన‌ట్లుండి టీడీపీ ప‌రిస్థితి. రెండేళ్ల క్రితం జ‌ర‌గాల్సిన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయించి, ఇప్పుడు ఆ ఎల‌క్ష‌న్‌లో పోటీ చేసే నాయ‌కులే లేక ఉసూరుమంటోంది. అది కూడా పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో. టీడీపీ తరఫున ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా నాయకులపై బాబు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంద‌ట‌.

ఎలాగైనా నామినేషన్లు వేయించి ఎన్నికలు జరిగేలా చూడాలని హుకుం జారీ చేసినా, ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడ‌ని స్థానిక రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో త‌మ‌ను ప‌ట్టించుకోని వ్య‌క్తి, ఇప్పుడు పోటీ చేయ‌మ‌ని కోర‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని చెవులు కొరుక్కుంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖ‌లు ప్ర‌క్రియ మొదలైన సంగ‌తి తెలిసిందే.

చిత్తూరులో కూడా నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైంది. అయితే తొలిరోజు టీడీపీకి మద్దతుగా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో బాబే స్వ‌యంగా రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. ఎలాగైనా నామినేషన్‌ వేయాలని స్థానిక నేత‌ల‌ను ఫోన్‌లో కోరినట్లు తెలుస్తోంది. అయితే వాళ్లు మాత్రం.. పార్టీ ప్ర‌స్తావ‌న లేకుండా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో తాము టీడీపీ త‌ర‌ఫున ఎలా పోటీచేస్తామంటూ త‌మ నిర్ణ‌యాన్ని గ‌ట్టిగానే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఏదైమైనా జిల్లాలో మ‌రికొన్ని స్థానాలు ఏక‌గ్రీవాలు అయితే టీడీపీకి భంగ‌పాటు త‌ప్ప‌దు మ‌రి!

బూటకపు ఎన్నికలను బహిష్కరించండి

3 నిమిషాల పాట కోసం అనసూయ రూ. 20 లక్షలు డిమాండ్..

కొత్త చరిత్ర సృష్టించబోతున్న రౌడీ బేబీ

పవన్‌ అప్పుడు టీడీపీ.. ఇప్పుడు బీజేపీ ని యాచిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -