Friday, May 3, 2024
- Advertisement -

దసరా కాదు.. అంతకంటే ముందే అఖండ..!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకు కారణం బోయపాటి -బాలకృష్ణ కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ లు సింహా, లెజెండ్ రావడమే.వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా అఖండ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ నడుస్తోంది. ఈ నెల ఆఖరు కల్లా సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

అయితే ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ దసరా రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో.. అఖండను సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. పండుగ హాలిడేస్ కలిసి వస్తాయని భావించారు.

అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి ఓ పోస్టర్, నిన్న ఓ మేకింగ్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సందర్భాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తామని మేకర్స్ మెన్షన్ చేశారు. దీంతో అఖండ చిత్ర యూనిట్ ఆలోచనలో పడిందని టాక్. ఆర్ఆర్ఆర్ తో పోటీ పడడం కన్నా అఖండ సినిమాను తన కంటే ముందే సెప్టెంబర్లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఆర్ఆర్ఆర్ దసరా సందర్భంగా విడుదల అవుతుండటంతో ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలను కూడా ఎప్పుడు విడుదల చేయాలా అని మేకర్స్ ఆలోచనలో పడ్డారు. ఆ రెండు సినిమాలకు సంబంధించి విడుదల తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. బాలకృష్ణ మాత్రం వీరిద్దరి కంటే ముందే థియేటర్లోకి రానున్నాడు.

Also Read

నవీన్​ పొలిశెట్టితో మూవీకి నో చెప్పిన స్వీటీ..!

చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

ఎవరు మీలో కోటిశ్వరుడు? ఫస్ట్​ గెస్ట్​ గా ఎవ్వరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -