Saturday, May 18, 2024
- Advertisement -

త‌మ‌న్నా ల‌వ్ స్టోరీ ఇదే!

- Advertisement -

త‌మ‌న్నా తెర‌పై కనిపిస్తే చాలు.. మన డ్రీమ్ గాళ్‌ కూడా ఇలానే ఉండాలి అని ఈత‌రం కుర్రకారు ఆశపడుతుంటారు. అయితే తమన్నా ని చాలా మంది ఇష్టపడుతుంటారు. త‌మ‌న్నాతో 100 % ల‌వ్‌లో ఉన్న వ‌న్‌సైడ్ ల‌వ‌ర్స్ ఎంతోమంది. అయితే త‌మ‌న్నా కూడా లవ్ లో పడిందట. అసలు తమన్నా ఎవరిని? ఎక్కడ? ఎప్పుడు? ప్రేమించింది.

ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన సంగతులను త‌మ‌న్నాని అడిగితే ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఐద‌వ త‌ర‌గ‌తిలోనే త‌మ‌న్నా ప్రేమలో ప‌డిపోయింద‌ట‌. త‌న స్నేహితురాలి అన్నయ్యని బాగా ఇష్టప‌డింద‌ట‌. కానీ.. తాను మాత్రం కొంచెం కూడా ప‌ట్టించుకోలేద‌ట‌. చివ‌రికి ‘నా చెల్లెలెంతో నువ్వు కూడా అంతే’ అంటూ బాంబు పేల్చాడ‌ట‌. అప్పటి నుంచీ ప్రేమ జోలికి వెళ్లలేదు అంటోంది మిల్కీ బ్యూటీ.

“లవ్ గురించి తెలియ‌ని రోజుల్లో ఓ తెలియ‌ని ఆకర్షణ‌ లో ప‌డ్డా. అదే నా మొదటి చివ‌రి ల‌వ్ స్టోరీ. ప్రస్తుం లవ్ గురించి ఆలోచించే టైం లేదు.  ప్రేమించినా.. అదేం అల్లరి చిల్లర‌గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఓ మెచ్యూరిటీ వ‌చ్చేసింది. నేనేం చిన్నపిల్లని కాదు క‌దా?? ” అంటోంది త‌మ‌న్నా. ఎవరినైనా ప్రేమిస్తే.. చెప్పడానికి ఆలోచించ‌న‌ని, అమ్మానాన్నల ప‌ర్మిష‌న్ తీసుకొంటాన‌ని అంటోంది. ఇక ప్రస్తుతం తమన్నా బాహుబ‌లి 2, అభినేత్రి సినిమాల‌తో బిజీగా ఉంది.

Related

  1. ఎన్టీఆర్ కోసం రాజమౌళి కథ సిధ్ధం చేస్తున్నారు!
  2. మహేష్ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది!
  3. అఖిల్… నిశ్చితార్థం ఎప్పుడంటే?
  4. ఆ హీరోయిన్ ని బాధపెడుతున్న పవన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -