Tuesday, May 14, 2024
- Advertisement -

ఒక మనసు దెబ్బ గట్టిగానే తగిలింది నిహారికకు!

- Advertisement -

మెగా హీరోయిన్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఒక మనసు భారీ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ కావడం వల్ల నిహారిక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ.. ఇవన్నీ రూమార్స్ అని అంటున్నారు. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం నిహారిక రెండో సినిమాకి రెడీ అయ్యిందట.

మరాఠీలో ఘన విజయం సాధించిన హాపీ జర్నీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ లో నటించేందుకు నిహారిక ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని “సినిమా చూపిస్త మావ” సినిమాని నిర్మించిన బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్నారు. ఇద్దరు అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం, ఎమోషన్స్ ఆధారంగా ఈ చిత్ర కథ ఉంటుందట. అనుకోకుండా కొన్ని కారణల వల్ల చెల్లెలు చనిపోతుంది. ఆ తర్వాత ఆమె దెయ్యంగా మారి.. అన్నకు సాయం చేస్తుంది. చివరికి కష్టాలన్నీ తీరిపోయాక ఆమె వదిలివెళ్లిపోతుంది. 

ఈ చిత్ర కథ బాగా నచ్చడంతో ఇందులో నటించేందుకు నిహారిక వెంటనే ఒప్పుకుందని తెలుస్తోంది. అన్న పాత్రలో హర్షవర్ధన్ రాణే నటించనున్నాడట. మిగిత వివరాలు త్వరలో తెలపనున్నారు. 

Related

  1. అయ్యో…నిహారిక!!?
  2. నిహారిక సినిమాని కోసి పడేసారు
  3. నిహారిక మంచి మార్కులు కొట్టేసింది
  4. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -