Wednesday, May 22, 2024
- Advertisement -

బయటపడ్డ పెద్ద సీక్రెట్.. ఎన్టీఆర్‌కి పెద్ద లోపం ఉందట

- Advertisement -
NTR Jai Character Battarism Problem In Jai Lava Kusa

ఎన్టీఆర్‌కి సంబంధించి ఓ పెద్ద సీక్రెట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కి ఓ లోపం వుందని సమాచారం. ఇన్నాళ్ళూ ఎవరికీ తెలియకుండా ఆ లోపాన్ని దాచాడు కానీ.. చివరికి అది లీకైపోయింది. ఇంతకీ ఆ లోపం ఏంటనుకుంటున్నారా? నత్తి. అవును.. మీరు చదువుతోంది నిజమే. ఎన్టీఆర్ కు నత్తి సమస్య వుందట.

అయితే ఈ నత్తి ఉన్నది రియల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో  ‘జై లవ కుశ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్  మూడు పాత్రలు పోషిస్తుండగా.. అందులో జై క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో వుంటుందని, ఈ పాత్రకి నత్తి కూడా వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆ క్యారెక్టర్‌లో తారక్ విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. మొత్తానికి.. ఇదివరకెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ఎన్టీఆర్ ని మనం చూడబోతున్నామన్నమాట.

నిజానికి గతంలో స్టార్ హీరోలు కుంటి, గుడ్డి, మూగ.. ఇలా ఏదో ఒక లోపం వుండే పాత్రల్లో నటించి అలరించారు. అయితే.. రానురాను కమర్షియల్ చిత్రాలు ఎక్కువైపోవడంతో, అలాంటి పాత్రలు కనిపించడం మానేశాయి. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారబోతోంది. ఈ తరం స్టార్ హీరోలు ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే.. సుకుమార్ డైరెక్షణ్‌లో రామ్ చరణ్ వినికిడి లోపం వున్న యువకుడిగా నటిస్తున్నాడు. అలాగే.. ‘అంధగాడు’లో రాజ్‌తరుణ్, ‘రాజా ది గ్రేట్‌’లో రవితేజ అంధుడి పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నత్తి వున్న విలన్ రోల్‌లో నటిస్తున్నాడు. 

{youtube}Y9IGVrjZihQ{/youtube}

Related

  1. యాంకర్ లాస్య గురించి ఎవరికి తెలియని సీక్రెట్
  2. బాహుబలిని చంపింది కట్టప్ప కాదు.. బయటపడ్డ సీక్రెట్‌
  3. డీజే మూవీలో ఉహించని సీక్రెట్ లీక్ అయింది
  4. లేడీస్ సీక్రెట్స్ ఎందుకు దాచుకోలేరో తెలుసా..? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -