ఎన్టీఆర్ వరస హిట్లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను దసరాకు విడుదల చేయలని భావిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా పూజ హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది అలా ఉంటే ఎన్టీఆర్ సినిమాలు కాకుండా మరో రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు రూ.20 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ సమాచారం. ఈ మధ్య వరుస హిట్స్ కొడుతున్న తారక్ ఈ డబ్బులతో కొన్ని ఫ్లాట్లు – కమర్షియల్ బిల్డింగ్ లను కొనుగోలు చేశాడు. తాజాగా జూనియర్ మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి దిగినట్లు సమాచారం. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల్లో చిన్న సైజు మల్టీఫ్లెక్స్ థియేటర్లను నిర్మించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.