Monday, April 29, 2024
- Advertisement -

కోదండ రాం ఒంటరిగా వేల్లాల్సిందేనా..?

- Advertisement -

ఎన్నికల్లో పోటీ చేయాలనీ బాగా ఉబలాటంగా ఉన్న కోందండ రాం ఎట్టకేలకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.. టీజెఎస్ దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వగా కోదండరాం వ్యక్తిత్వం గురించి తెలంగాణ ఉద్యమంలో ఆయన్ని చూసిన ఎవరైనా చెప్తారు.. తెలంగాణ లో కోదండరాం పాత్ర చాలా ఉండి. జేఏసీ పేరుతొ అయన అప్పటి ప్రభుత్వం పై చేసిన పోరాటం అంతా ఇంతా కాదు కేసీఆర్ తో కలిసి అయన తెలంగాణ తేవడంలో ప్రత్యేక కృషి చేశారు..

ఇక ప్రస్తుత విషయానికొస్తే తెలంగాణ లో విద్యావంతుల్లో, తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో ప్రభు్తంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వారికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని, విద్యావంతులని తగిన విధంగా గౌరవించలేదని ఆ ప్రచారం జరుగుతుండగా, ఇది కోదండరాం కి లభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కోదండరాం కి ప్రాధాన్యం తగ్గిపోయింది.

కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ప్రత్యేక తెలంగాణ లక్ష్యాలు నెరవేరడం లేదని తెలంగాణ జన సమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. కానీ వివిధ కారణాల రీత్యా ఆ పార్టీ ప్రజల్లో బలమైన ముద్రవేయలేకపోయింది. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఆ పార్టీ తరపున అభ్యర్థులు నిలబడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత మహాకూటమి ఉనికి లేకుండా పోయింది. ఈ తరుణంలో కోదండరాం.. ఎమ్మెల్సీగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అయితే మహాకూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పోటీ చేయాలనీ నిర్ణయించుకోవడంతో వారి మద్దతు ఇప్పుడు కోందండరాం కి ఉంటుందా లేదా అన్నది పెద్ద సమస్య గా మారింది.. కోదండరాంపై విద్యావంతుల్లో సానుభూతి ఉందని.. ఆయన ఉద్యమ సేవలకు గుర్తుగా.. ఆయనను ఎమ్మెల్సీగా గెలిపిస్తారన్న ప్రచారం ఉంది. మరి ఆ సానుభూతి అయన గెలుపు కు పనికొస్తోందా అనేది చూడాలి..

కెసిఆర్ కి షాక్ ఇచ్చేలా గులాబీ నేతను రంగంలో కి దించిన కాంగ్రెస్..?

తెలంగాణ లో కేసీఆర్ మాటే నెగ్గుతుందా..?

ఉత్తమ్ పోస్ట్ ఊడుతుందా.. కాంగ్రెస్ నేతలే చెప్తున్నారుగా.?

కేసిఆర్ పైన కోదండ రాం ఎత్తులు ఫలించేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -