Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్‌ కు మరీ ఇంత ఎందుకు?

- Advertisement -

పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ కి ఏ రెంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌ హీరోలందరి కంటే పవన్‌ కే ఎక్కువ శాతం అభిమానులు ఉన్నారు అని మెగా అభిమానులు అంటూ ఉంటారు. అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవర్ స్టార్ తన సినిమా విషయంలో చాలా కేర్‌లెస్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎలాంటి చిత్రాలు తీయాలి, ఎలాంటి స్టోరీలు ఎంచుకోవాలి అనే విషయంలో పవన్ ఎక్కువగా ఆలోచించడు.

తనకు నచ్చిన సినిమా చేయాలి అనుకుంటాడు. అలా చేసిన చిత్రాలే ‘జానీ’ మరియు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద ఫ్లాప్‌ అయ్యాయి. ఇక ప్రస్తుతం పవన్ డాలీ డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా, పవన్‌ ఇంకా సెట్స్‌ వైపే వెళ్లలేదు. పవన్‌ కళ్యాణ్‌ పనులతో బిజీగా ఉన్నాడా లేక షూటింగ్‌ అంటే బద్దకంతో అటువైపు వెళ్లడం లేదా అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది.

పవన్‌ కళ్యాణ్‌ తీరిక లేనంత బిజీ పనులు కూడా ఏమీ చేయడం లేదు. పవన్ సినిమా కోసం ఎన్నో కోట్ల మంది జనాలు ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం పలు కారణాలతో వరుసగా సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇప్పటికైన పవన్ తన సినిమాని త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

Related

  1. ఆ హీరోయిన్ కి దెబ్బ కొట్టిన పవన్‌, మహేష్‌!
  2. పవన్‌కల్యాణ్‌ రెమ్యునేషన్
  3. ” పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది “
  4. పవన్ కళ్యాణ్ కడప కింగ్ స్టోరీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -