Tuesday, May 14, 2024
- Advertisement -

కుప్పంలో అరాచకం ఎవరిది.. చంద్రబాబు దా ? జగన్ దా ?

- Advertisement -

కుప్పం నియోజిక వర్గం టిడిపికి కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా చంద్రబాబు కుప్పంలో ఏక చక్రధిపత్యం వహిస్తున్నారు. అలాంటి కుప్పం సీటును కైవసం చేసుకోవాలని వైఎస్ జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్న జగన్.. తొలి విజయం కుప్పం నుంచే మొదలు కావాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ నిజంగానే పాగా వేయగలదా ? అంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే.. కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంఖా మోగించింది. స్థానిక ఎన్నికలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే కుప్పం సీటు కైవసం చేసుకోవాలని వైఎస్ జగన్ దృఢ నిశ్చయంతో ఉన్నారు. .

అయితే కుప్పం చంద్రబాబు సొంత నియోజిక వర్గం కావడంతో బాబు వ్యూహాలను తిప్పికొట్టడం జగన్ కు కత్తి మీద సామే. అయితే ఆ మద్య జరిగిన కుప్పం ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి విధితమే. చంద్రబాబు ను వైసీపీ నేతలు అడ్డుకోవడం.. ఆ తర్వాత ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం.. ఇవ్వన్ని కూడా ప్రస్తుతం కుప్పం రాజకీయానికి అద్దం పడుతున్నాయి. ఇక తాజాగా కుప్పం నియోజిక వర్గంలో జరిగిన సమీక్షలో చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం లో జగన్ అరాచకం సృష్టించేందుకు సిద్దమయ్యారని. అందుకు ఉదాహరణ అమద్య జరిగిన ఘటనే అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పులివెందుల మాదిరి ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవడం కుప్పంలో జరగదని, ఇక్కడి ప్రజలు అభిమానంతో ఓట్లు వేస్తారని చంద్రబాబు అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు వేరే పార్టీ గెలిచింది లేదని, ఎప్పటికీ ఇతర పార్టీలకు ఇక్కడ స్థానం లేదని చంద్రబాబు తనదైన రీతిలో వ్యాఖ్యానించారు. ఇక ఆ మద్య వైస్ జగన్ కుప్పం గురించి ప్రస్తావిస్తూ.. కుప్పం ప్రజల్లో మార్పు వస్తోందని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నుంచి విముక్తి కోరుకుంటున్నాని.. అందుకే ఇక్కడి ప్రజలు వైసీపీని ఆధారిస్తున్నాని చెప్పుకొచ్చారు. మరి రాష్ట్ర రాజకీయాలను ఆకర్షిస్తున్న కుప్పం నియోజిక వర్గంలో చంద్రబాబు ఎప్పటిలాగే చక్రం తిప్పుతారా ? లేదా జగన్ వైసీపీ జెండా ఎగురవేస్తారా ? అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి

జనసేనలోకి వలసలు.. జనసేనాని ప్లానేంటి ?

“కెమెరా మాతాకి జై “.. మోడీ కెమెరా ఫోజులు !

ఉచిత పథకాలతో వాళ్ళకు బాద.. మోడీ వ్యాఖ్యలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -