- Advertisement -

ఆస్కార్ రేంజ్ కి వెళ్ళిన మన హీరోయిన్

- Advertisement -

క్వాంటికో టీవీ సీరీస్ ని ఏ క్షణం లో ఓకే చెప్పిందో కానీ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నెమ్మదిగా హాలీవుడ్ రూట్ లోకి వెళ్ళిపోయింది. క్వాంటికా సెకండ్ సీజన్ కూడా మొదలు కాబోతోంది, ఈ షూటింగ్ లో ప్రస్తుతం ఆమె బిజీ గా ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదుగుతున్న ఆమె మరొక అరుదైన ఛాన్స్ కొట్టేసింది.

ఈ నెలాఖరు లోగా జరగబోతున్న ఆస్కార్ అవార్డుల పండగ లో ప్రేజెంటర్ గా ఎంపిక అయ్యింది ఆమె. అవార్డులు ప్రధానం చేసే వారి పేర్లు ఆస్కార్ అకాడమీ ట్విట్టర్ లో పెట్టగా అందులో ప్రియాంకా చోప్రా పేరు కూడా ఉండడం సంచలనంగా మారింది. ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద ఆమె రచ్చ చెయ్యబోతోంది అన్నమాట.

ఫిబ్రవరి 28(మన టైమ్ లో 29 తెల్లవారు ఝాము)న జరగనున్న ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని.. ఆ అద్భుతమైన రాత్రి కోసం ఆతృతగా ఉన్నానంటూ ట్విట్టర్ పోస్ట్ చేసింది  ప్రియాంక. ఈమె సినిమా బాజీరావ్ మస్తానీ సూపర్ హిట్ కొట్టి ఫిలిం ఫేర్ నుంచి ఈమెకి అవార్డుల పంట కూడా పండించింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -