Sunday, May 5, 2024
- Advertisement -

బయటపడ్డ సీక్రెట్.. సమంతకు అసలు మాటలు రావట..

- Advertisement -
Ramcharan Samantha Top Screte

డైరెక్టర్ సుకుమార్ ఏ సినిమా తీసిన అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. ఆయన ఆర్య దగ్గర నుంచి నాన్నకు ప్రేమతో వరకు డిఫరెంట్ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో చరణ్ చేవిటివాడిగా నటిస్తున్నాడనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. పూర్తిగా చెవుడు కాకుండా, వినిపించీ వినబడని రేంజ్ లో చెవుడు ఉండే పాత్ర చేస్తున్నాడనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. ఇదే పెద్ద ప్రయోగం అనుకుంటే ఇప్పుడు సమంతకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్. రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె మూగదాని పాత్ర చేస్తోందట. వినడానికి షాకింగ్ గా ఉన్నప్పప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం ఇదే.

80ల నాటి పల్లెటూరి ప్రేమకథ, హీరోకు చెవుడు, హీరోయిన్ మూగ. ఇలాంటి క్వాలిటీస్ ఆర్ట్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా రామ్ చరణ్-సమంత మధ్య వచ్చే ఓ పాటతో షూటింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆ సీన్లు పిక్చరైజ్ చేసిన తర్వాతే సమంత మూగ పాత్ర పోషిస్తోందనే రూమర్ బయటకు వచ్చింది. ఇక సమంత రీసెంట్ గా చేసిన ఓ ప్రకటన దీనికి మరింత బలం చేర్చింది. కొంచెం వెయిట్ ఉన్న రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పిన సమంత చరణ్ సినిమాతో కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు వెల్లడించింది. 

Related

  1. బయటపడ్డ పెద్ద సీక్రెట్.. ఎన్టీఆర్‌కి పెద్ద లోపం ఉందట
  2. యాంకర్ లాస్య గురించి ఎవరికి తెలియని సీక్రెట్
  3. డీజే మూవీలో ఉహించని సీక్రెట్ లీక్ అయింది
  4. సీక్రెట్‍గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న భావ‌న.. ఎవరినో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -