Wednesday, May 22, 2024
- Advertisement -

జయలలిత గా రమ్యకృష్ణ!

- Advertisement -
ramya krishna in jayalalitha biopic

తారల లైఫ్ ఆధారంగా వచ్చిన సినిమాలకు మంచి పేరుతో పాటు, మంచి లాభాలు వస్తున్నాయి. అలనాటి తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా చేసుకొని డర్టీ పిక్చర్  సినిమా వచ్చి మంచి సక్సెస్ అయ్యింది. అందుకే సీనియర్ నటుల బయోపిక్ తెరకెక్కించడానికి కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు.

మహానటి సావిత్రి పై సినిమా తీసేందుకు ప్రయత్నాలు బానే జరుగుతున్నాయి. ఇప్పుడు గొప్పనటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత లైఫ్ లోని ప్రధాన ఘట్టాలను తీసుకొని మంచి సినిమా తీయాలని ఓ తమిళ నిర్మాత రెడీ అవుతున్నాడు. ఆమె కథను టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు శాండిల్ వుడ్ లోను చూస్తారని ధీమాతో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారు.

జయలలిత క్యారక్టర్ కి ఎవరు సూటవుతారు? అని ఆయన తన టీమ్ తో చర్చించగా అందరూ రమ్య కృష్ణ కే ఓటు వేశారంట. నరసింహ, బాహుబలి చిత్రాల్లో ఆమె చేసిన నటనను వారు మర్చిపోలేకపోతున్నారు. నటిగా, పార్టీ కార్యకర్తగా, ముఖ్యమంత్రిగా జయలలిత లైఫ్ సాగింది. అలాగే జైల్లోనూ కొంత కాలం గడిపారు. అలాంటి ధీర వనితగా నటించాలంటే రమ్యకృష్ణ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. త్వరలోనే రమ్యకృష్ణను ఆ నిర్మాత కలిసి మీడియాకు పూర్తి వివరాలను తెలపనున్నాడు.

Related

  1. జయలలిత.. పెద్ద మనసు.. గురించి తెలిస్తే షాకే!
  2. జయలలితకు శశికళ కు సంబంధం ఏంటి?
  3. ఇద్దరమ్మాయిల అసహజ శృంగారం!
  4. బన్నీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్మీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -