Friday, April 26, 2024
- Advertisement -

హిందీలోకి రీమేక్ కాబోతున్న అపరిచితుడు

- Advertisement -

భారతీయ సినీ దర్శకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శంకర్. తీసిని తక్కువ సినిమాలే అయినా.. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం కమల్ హసన్ హీరోగా ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. .అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ బ్రేక్ ప‌డింది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే, ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో చ‌రణ్ బిజీగా ఉన్నారు. దీన్ని పూర్తిచేయ‌డానికి స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంది. కాబట్టి ఈ గ్యాప్‌లో విక్ర‌మ్ ను హీరోగా పెట్టి తీసిని అప‌రిచితుడు (అన్నియ‌న్) సినిమాను హిందీలో రీమేక్ చేయాల‌ని శంక‌ర్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా వ‌చ్చి 16 సంత్సరాలు అవుతుంది. అప్ప‌ట్లో ఈ సినిమా ఓ సెన్సేష‌న‌ల్‌గా నిలిచింది. హీరో విక్ర‌మ్‌తో పాటు ద‌ర్శ‌కుడికి మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సంగ్‌ను హీరోగా పెట్టి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ర‌ణ్‌వీర్ సింగ్ తాజాగా చెన్నైకి వ‌చ్చి మ‌రీ శంక‌ర్ ను క‌లిసి వెళ్లారు. ఇదే గ‌నక నిజ‌మైతే ఇది క్రేజీ ప్రాజెక్టు కానుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా? లేదా? అనేది తెలియాలంటే మ‌రింత స‌మ‌యం ఆగాల్సిందే.. !

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -