కేరళలో ‘లవ్‌ జిహాద్‌’ నిరోధక చట్టం తెస్తామన్న బీజేపీ

- Advertisement -

గత కొంత కాలంగా లవ్ జిహాద్ పై దేశంలో పెద్ద చర్చే నడుస్తోంది. లవ్ జిహాద్ పేరిట బలవంతపు మత మార్పిడిలకు పాల్పడుతున్నారని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు ల‌వ్ జిహాద్ నిరోధ‌క చ‌ట్టాల‌ను తీసుకువ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కేర‌ళ‌లోనూ ల‌వ్ జిహాద్ చ‌ట్టాన్ని తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర బీజేపీ చేబుతోంది.

కేర‌ళ‌లో త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో పాగ వేయాల‌ని బీజేపీ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న ఎన్నిక‌ల ప్రచారంలో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇత‌ర పార్టీలు, అధికార పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌నల‌తో దూసుకుపోతోంది. కేర‌ళ‌లో త‌మ‌ను గెలిసిస్తే ల‌వ్ జిహాద్ నిరోధ‌క చ‌ట్టాన్ని తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు కే.సురేంద్ర‌న్ వెల్ల‌డించారు.

- Advertisement -

కేర‌ళలో ల‌వ్ జిహాద్ ల‌క్ష్యంగా మారామ‌ని క్రిస్టియ‌న్లు ఆందోళ‌న చెందుతున్నార‌ని పేర్కొన్నారు. ల‌వ్ జిహాద్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క్రిస్టియ‌న్లు కోరుతున్నార‌ని తెలిపారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కంటే కేర‌ళ‌లోనే ల‌వ్ జిహాద్ కేసులు అధికంగా ఉన్నాయ‌ని వివ‌రించారు. కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాలు ఇదివ‌ర‌కే ల‌వ్ జిహాద్ నిరోధ‌క చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చాయి. తాజాగా హ‌ర్యానా ప్ర‌భుత్వం కూడా త్వ‌ర‌లోనే ల‌వ్ జిహాద్ చట్టాన్ని తీసుకురాబోతున్నామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -