Thursday, April 25, 2024
- Advertisement -

మరో మెగాహీరో సరసన రష్మిక మందన్న..!

- Advertisement -

‘ఛలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది. ఇక తన రెండవ సినిమా ‘గీతగోవిందం’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత వరసగా స్టార్ హీరోలు సరసన అవకాశలను దక్కించుకుంది ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా, తమిళంలో సుల్తాన్ సినిమా, మరుయు శర్వానంద్ తో ఓ సినిమాలోను నటించబోనున్నట్టు నమాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య లోకూడా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసిందట. సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే ఒక కీలక పాత్రను రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఒక సాంగ్ కూడా ప్లాన్ చేసాడట దర్శకుడు కొరటాల శివ. సాంగ్ లో చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటిస్తారంట.

అయితే అ పాటలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న నటించబోతుందట. ముందుగా కియారా అద్వానీని అనుకున్న ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రష్మిక ను సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్న రామ్ చరణ్ జనవరి మూడో వారంలో ఆచార్య సినిమా షూటింగులో జాయిన్ అవుతాడట. మార్చి నెలలో రష్మిక షూటింగ్ లో పాల్గొంటుందట.

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -