Sunday, May 5, 2024
- Advertisement -

మళ్లీ పెరుగుతున్న బంగారం.. అదే బాటలో వెండి!

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ మద్య బంగారం ధర కాస్త ఊరట ఇచ్చినా మళ్లీ పెరగడం మొదలు పెట్టింది. ఇక బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే పరుగులు తీశాయి.. బంగారం ధరలు ఈరోజు కూడా పై చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల బాట పట్టాయి.

పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 46,100 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు పైకి కదిలి మళ్ళీ 50 వేలరూపాయల మార్క్ అందుకుంది. దీంతో 50,290 రూపాయల వద్దకు చేరుకుంది. ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 200 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో 48,250 రూపాయల వద్దకు చేరుకుంది. అంటే 220 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ధర 52,630 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 1600 రూపాయలు పెరిగింది. కేజీ వెండి ధర 64,000 రూపాయల వద్దకు చేరుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -