Tuesday, May 14, 2024
- Advertisement -

పాపం.. సాయిధరమ్‌ను బ‌న్నీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు!

- Advertisement -

కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ చేసిన “చెప్పను బ్రదర్” అనే మాట వల్ల ప‌వ‌న్‌-బ‌న్నీ అభిమానుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రిగింది. దాంతీ గొడవ పెద్దది కాకుండా బ‌న్నీ దీనిపై క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్ స‌ద్దుమ‌ణిగింది. అయితే ఇటివలే ‘తిక్క’ ఆడియో వేడుకలో  సాయిధరమ్ తేజ్ చేసిన ‘చెబుతాను బ్రదర్’ వ్యాఖ్యలు మళ్లీ నిప్పురాజేశాయి.

దీంతో బ‌న్నీకి సాయి కౌంట‌ర్ ఇచ్చాడ‌న్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌న‌మ‌య్యాయి. ఇది బన్నీ ఫ్యాన్స్ కి నచ్చలేదు. తిక్క సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో వాళ్లకు మంచి ఛాన్స్ దొరికినట్లయింది. ‘తిక్క’ రిలీజ్ అయ్యి మొదటి షోకే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొంది. దాంతో సోషల్ మీడియాలో ‘తిక్క’ మీద సెటైర్లు మొదలయ్యాయి. ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి సాయిధరమ్‌ను బ‌న్నీ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు.

సాయి బ‌న్నీపై చెపుతాను బ్ర‌ద‌ర్ అన‌గానే ఈ డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ఇప్పుడు తిక్క ప్లాప్ అవ్వ‌గానే బ‌న్నీ అభిమానులు సాయిని టార్గెట్‌గా చేసుకుని ఇప్పుడు ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ సాయిధరమ్ గాలి తీసే పనిలో పడ్డారు. మరి బ‌న్నీ వ‌ర్సెస్ సాయిధ‌ర‌మ్ మ‌ధ్య ఈ గొడవ ఏమవుతుందో చూడాలి.

Related

  1. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  2. సాయి కుమార్ కొడుకు భయ పడుతున్నాడు
  3. మరోసారి పవన్ పేరు చెప్పను బ్రదర్!
  4. తిక్క మూవీ రివ్యూ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -