Wednesday, May 1, 2024
- Advertisement -

తిక్క మూవీ రివ్యూ

- Advertisement -

మెగా ఫాన్స్ కి ఆశలు పెంచుతూ , చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ కొత్త స్టార్ గా అవతరిస్తున్నాడు. తన సినిమా సుప్రీం తో భలే హిట్ కొట్టిన సాయి ఈ సారి తిక్క అంటూ కొత్త లెక్కతో ఒచ్చాడు.

ఓం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తన మొదటి సినిమా తో కళ్యాణ్ రామ్ కి ప్లాప్ ఇచ్చినా గానీ అతని చెప్పిన కథ కి ఫిదా అయిన సాయి డేట్స్ కట్టబెట్టేసాడు. ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ కి ఆమడు దూరం లో ఆగిపోయిన సుప్రీం హీరో సాయి కి ఈ తిక్క ఏ రేంజ్ లో కిక్ ఇచ్చిందో చూద్దాం రండి

కథ – పాజిటివ్ లు:

ఆదిత్య – సాయి అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండే ఒక సాధారణ యువకుడు. తాగుబోతు కూడా, బాగా ఎక్కువగా తాగి అమ్మాయిల వెనకాల తిరగడం లో మనోడు ఎక్స్ పర్ట్ అన్నమాట .అలాంటి ఆదిత్య జీవితం లోకి అంజలి ప్రవేశించి అతనికి కొత్త లైఫ్ ఇస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ప్రాణంగా బతుకుతూ ఉన్న టైం లో ఆమెతో బ్రేక్ అప్ అవుతాడు ఆది. ఆ బ్రేక్ అప్ అతన్ని పిచ్చోడ్ని చేసి మళ్ళీ తాగుడుకి బానిసని చేస్తుంది. ఒక రోజు రాత్రి తప్ప తాగి అతని చేసిన తప్పు అతని జీవితం మొత్తాన్నీ మార్చేస్తుంది. అక్కడ నుంచీ కథ ఎన్ని మలుపులు తిరిగింది ఎటు వెళ్ళింది అనేది కథాంశం. అంజలి, ఆదిత్యకు బ్రేకప్ ఎందుకు చెబుతుంది? ఎన్నో మలుపులు తిరిగిన కథ చివరకు ఎక్కడకు చేరుతుందీ? అన్నది సినిమా. సినిమా మొత్తాన్నీ తన సర్వ శక్తులతో కాపాడడానికి ప్రయత్నం చేసాడు హీరో సాయి. ఎంతో పర్ఫెక్షన్ తో , పరిక్వతమైన నటన తో సినిమా సినిమాకీ వైవిధ్యం చూపిస్తున్నాడు సాయి. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి కామెడీ టైమింగ్ వరకూ అన్నీ ఇంప్రూవ్ చేసుకున్న మనోడు థియేటర్ లో సినిమాకి కాపాడడం కోసం విశ్వ ప్రయత్నమే చేసాడు. అజయ్ తో పాటు అతని గ్యాంగ్ తో జరిగిన కామెడీ కూడా బాగా కోడిరింది. కమెడియన్ సత్యకు రాసిన స్టీఫెన్ అనే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆ పాత్రలో సత్య మంచి టైమింగ్‌తో నవ్వించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చిన కామెడీ సినిమా కి హై లైట్.

నెగెటివ్ లు:

మంచి కథని ఎంచుకున్న డైరెక్టర్ దాన్ని సరిగ్గా తెరకి ఎక్కించడం లో ఫెయిల్ అయ్యాడు. గత సినిమా ఇచ్చిన దారుణ ఫలితాలు చూసుకుని తనని తాను సరిజేసుకొని సునీల్ రెడ్డి ఇందులో కూడా లాజిక్ లు మిస్ అయ్యి పోయాడు.  ఫస్టాఫ్ అయితే పూర్తిగా లౌడ్ కామెడీతో నడుస్తూ చాలా చోట్ల విసుగు పుట్టించింది. సెకండాఫ్‌లో మళ్ళీ ఈ కన్ఫ్యూజన్‌ను అందుకొని నవ్వించే ప్రయత్నం చేసినా, అప్పటికే సినిమా అంతా దారితప్పిపోవడంతో ఏదీ కాపాడలేకపోయాయి. హీరోయిన్ ల అందాలు , పాటలు ఈ సినిమాకి ఎక్కడ ప్లస్ అవలేదు. తిక్క టైటిల్ సాంగ్ తప్ప అన్నీ సిగిరెట్ బ్రేక్ సాంగ్ ల లాగానే ఉన్నాయి. ఆలీ ముమైత్ ఖాన్ ల కామెడీ ట్రాక్ రోత పుట్టించింది, ఆ దశ లో విసుగుపుడుతుంది వ్యూయర్ లకి. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ కూడా వర్క్ అవ్వలేదు. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి బ్రేక్ అప్ చెప్తే పిచ్చోడిలగా తాగే హీరో అసలు ఆ అమ్మాయి తో సరిగ్గా ప్రేమలో ఉన్నట్టే కనిపించడు. ఇంటర్వెల్ బ్లాక్ ని తప్పిస్తే ఆకట్టుకునే ఎలిమెంట్ లేనే లేదు. 

కామెడీ సినిమా అంటేనే కన్ఫ్యూజన్ , అలాంటి కన్ఫ్యూజన్ కథని బాగానే ఎంచుకున్నాడు గానీ దానికి తగ్గట్టుగా మంచి సీన్ లు రాసుకోవడం లో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. తెలుగు సినిమాలో కన్ఫ్యూజన్ కామెడీ శకం నడుస్తున్న తరుణం లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి గానీ వాటిని చూసి చెయ్యి గల్చుకున్న సినిమా మాత్రం తిక్క అని చెప్పాలి. పెర్ఫెక్ట్ స్టోరీ ని సినిమాగా మలచడం లో డైరెక్టర్ పూర్తిగా పట్టు కోల్పోయాడు. సాయిధరమ్ తేజ్ ఎనర్జిటిక్ టైమింగ్ లాంటి అనుకూలాంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతావన్నీ ప్రతికూలాంశాలే. స్టార్ ఇమేజ్ దక్కించుకోవడం కోసం నాలుగు సంవత్సరాలుగా సాయి ధరం తేజ పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపొయింది.

రేటింగ్ : 2.25/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -