Wednesday, May 8, 2024
- Advertisement -

రష్మీ కి గట్టి దెబ్బ కొట్టిన శ్రీముఖి.. ఏం జరిగింది..?

- Advertisement -
srimukhi check lasya rashmi tollywood small screen

యాంకర్ శ్రీముఖి బుల్లితెర మీద హాట్ యాంకర్ గా తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ చానెల్ లో ప్రోగ్రాం చేస్తూ.. యూత్ కు బాగా దగ్గరైంది. ఇక అదే కాకుండా అదే ఛానెల్ లో డ్యాన్స్ షో జోడిగా వచ్చే ఈ ప్రోగ్రాం కు సుధీర్ తో పాటుగా ఇన్నాళ్లు రష్మీ చేసింది. ఏమైందో ఏమో ఓ రెండు ఎపిసోడ్స్ నుంచి రష్మీ ప్లేస్ లో శ్రీముఖి వచ్చి చేరింది.

రష్మీని రెమ్యునరేషన్ గొడవల వల్ల తప్పించారా లేక రష్మీ కన్నా శ్రీముఖికి క్రేజ్ పెరిగిందని ఆమెను తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. బుల్లితెర మీద సుధీర్, రష్మీ లది ఆన్ స్క్రీన్ హిట్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సడెన్ గా ఈ జంట మధ్యలోకి శ్రీముఖి వచ్చింది. సుధీర్ తో జోడి డ్యాన్స్ ప్రోగ్రాం శ్రీముఖి చేస్తుంది. శ్రీముఖి వచ్చాక ఇక ఆ షో ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

ఇప్పటికే పటాస్ లో పక్కా యూత్ ప్రోగ్రాం గా ప్రోగ్రాం డిజైన్ చేయగా ఇక ఇప్పుడు ఆ వేడి ఈ డ్యాన్స్ జోడి ప్రోగ్రాం కు పాకింది. మొన్నామధ్య రవి పక్క లాస్య కాకుండా శ్రీముఖి కనబడటంతో లాస్యని శ్రీముఖి తొక్కేసింది అన్నారు. ఇప్పుడు రష్మీని కూడా శ్రీముఖి అడ్డంగా తొక్కేసిందని అంటున్నారు. ఏది ఏమైనా రోజు రోజుకి శ్రీముఖి తన ఫాలోయింగ్ ను, క్రేజ్ ను మరింత పెంచుకుంటూ వెళ్తోంది.

Related

  1. శేఖర్ మాస్టర్, రష్మీ కి మధ్య కెమిస్ట్రీ.. సుధీర్‍కి మండింది!
  2. సుధీర్‍పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ!
  3. శ్రీముఖి కోరికను తీరుస్తున్న కొత్త డైరెక్టర్!
  4. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -