Sunday, May 5, 2024
- Advertisement -

ప్రభాస్ కు నోటీసులు.. వివరణ ఇవ్వాల్సిందే !

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మొట్ట మొదటి మైథాలాజికల్ మూవీ ” ఆదిపురుష్ “. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై మొదట్లో నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అక్టోబర్ 2న రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి. టీజర్ రిలీజ్ అయ్యిందో లేదో ఆ మూవీని వివాదాలు చుట్టూముట్టాయి. టీజర్ యానిమేషన్ మూవీలా ఉందంటూ.. ప్రభాస్ లుక్ అసలు బాగోలేదంటూ అభిమానులు భారీ ఎత్తున నిరాశ చెందారు. అంతే కాకుండా మూవీలోని గ్రాఫిక్స్ కూడా ఫెలవంగా ఉందని చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉండగా మూవీలోని రావణుడి లుక్ రామాయణాన్ని వక్రీకరించే విధంగా ఉందని హిందు సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. మూవీ రామాయణాన్ని వక్రీకరిస్తే సహించేది లేదని, మూవీ విడుదలను అడ్డుకుంటామని హిందూ సంఘాలు వార్నింగ్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని హిందూ సంఘాలు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాయి. హిందువుల మనోభావాలు గాయపరిచేలా మూవీ ఉందని, మూవీ విడుదలపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. ఇందుకు సంభందించి వివరణ కోరుతూ హీరో ప్రభాస్ తో చిత్రా యూనిట్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. దీంతో ప్రభాస్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. మరి కేవలం టీజర్ తోనే ఈ స్థాయిలో వివాదాలు చుట్టుముట్టిన ఆది పురుష్ మూవీపై.. విడుదల తరువాత ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read

రాజమౌళి.. తెలుగు సినీ “చరిత్రకోకడు”

బాలయ్య, బోయపాటి.. ఈసారి ఇండియా షేక్ అవ్వాల్సిందే !

ఎన్టీఆర్ కోసం రంగంలోకి బడా హీరో.. కొరటాల భారీ స్కెచ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -