Sunday, May 5, 2024
- Advertisement -

మీ మొబైల్ పోయిన వెంటనే.. తప్పక చేయవలసిన పనులు !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. మనకు అవసరమయ్యే ప్రతి పని కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే చేస్తున్నాం. షాపింగ్ మొదలు కొని బ్యాంకింగ్ లావాదేవీల వరకు ప్రతీది కేవలం మొబైల్ ద్వారానే చేస్తున్నాం. దాంతో మొబైల్ ఒక్క క్షణం మన చేతుల్లో లేకపోయిన ఏదో కోల్పోయిన ఫీలింగ్ కచ్చితంగా వస్తుంది. అలాంటిది మొబైల్ పోతే ఆ భాద వర్ణనాతీతం. అయితే చాలా మంది మొబైల్ పోయిన లేదా దొంగిలించబడిన వెంటనే కొత్త మొబైల్ కొనేస్తూ ఉంటారు. అయితే మొబైల్ పోయినప్పుడు చేయవలసిన ముఖ్యమైన పనులను మాత్రం పట్టించుకోరు. దాంతో మొబైల్ లోని సున్నితమైన సమాచారం అనగా మన పర్సనల్ డేటా, బ్యాంకింగ్ వివరాలు వంటి సమాచారం ఇతరుల చేతికి వెళ్లిపోతుంది. కాబట్టి మొబైల్ పోయిన లేదా దొంగిలించబడిన వెంటనే ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం !

1.పోలీసులకు ఫిర్యాదు చేయడం
మొబైల్ పోయిన వెంటనే చాలా మంది పోలీస్ కంప్లేయింట్ ఇవ్వడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఉంటారు. పోలీస్ కంప్లేయింట్ ఇవ్వడం వల్ల మొబైల్ తిరిగి దొరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మొబైల్ కు సంబంధించిన ఐ‌ఎం‌ఈ‌ఐ ( IMEI ) నెంబర్స్ కంప్లేయింట్ లో జత చేయడం వల్ల సెంట్రల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోలీసులు పోయిన ఫోన్ ను ట్రాక్ చేసి పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మొబైల్ ఐ‌ఎం‌ఈ‌ఐ ( IMEI ) నెంబర్ల ద్వారా కంప్లేయింట్ ఇవ్వాలి.

2.సిమ్ కార్డ్ బ్లాక్ చేయడం
మొబైల్ పోయిన తరువాత చయవలసిన మరొక ముఖ్యమైన పని సిమ్ కార్డ్ బ్లాక్ చేయడం. ఎందుకంటే మన మొబైల్ నెంబర్ కు వచ్చే పోన్ కాల్స్, ఓటిపి వంటి ఇతరత్రా సమాచారం ఇతరుల చేతికి వెళ్లకుండా వెంటనే.. కస్టమర్ కేర్ ద్వారా మొబైల్ సిమ్ కార్డ్ బ్లాక్ చేయించుకోవడం ఉత్తమం. సిమ్ కార్డ్ బ్లాక్ చేసిన తరువాత మళ్ళీ అదే నెంబర్ పై కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలి.

3.మొబైల్ కు లాక్ వేయడం
మొబైల్ పోయిన తరువాత పోన్ లోని డేటా ఇతరుల చేతికి దొరకాకుండా ఫోన్ డేటా ఎరైజ్ చేసుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ( CEIR ) అనే వెబ్సైట్ ద్వారా పోయిన పోన్ కు లాక్ చేసుకునే వీలు ఉంది.

4.మొబైల్ డేటా డిలీట్ చేయడం
ఒకవేళ మన మొబైల్ పొగుట్టుకుపోయిన లేదా దొంగిలించబడిన ఆ ఫోన్ లోని డేటాను పూర్తిగా ఎరైజ్ చేయవచ్చు. అందుకోసం ఫైండ్ మై డివైజ్ ( find my device ) అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ- మెయిల్ తో లాగిన్ అయిన తరువాత మొబైల్ ఆన్ లో ఉంటే మొబైల్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే.. మొబైల్ లోని డేటా ను ఇతరులు చూడకుండా డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.

కాబట్టి మొబైల్ పోయిన లేదా దొంగిలించబడిన ఈ పనులు చేయడం మాత్రం మర్చిపోకండి.

Also Read

మీరు వాట్సప్ గ్రూప్ లో ఉన్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్ !

మొబైల్ నెట్వర్క్ ను 4G నుంచి 5G కి మార్చండిలా !

వాట్సప్ : మీరు ఆన్లైన్ లో ఉంటే.. ఈ సెట్టింగ్ చేసుకోండీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -