నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన అధిపురుష్ పై ఏ స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయో అందరికీ తెలిసిందే. మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కాకముందు మూవీపై ఆకాశమంత అంచనాలు ఉండేవి. కానీ టీజర్ రిలీజ్ అయిన తరువాత అంతకు మించి విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్ అత్యంత దారుణంగా ఉన్నాయని, కార్టూన్ మూవీలా ఉందంటూ చిత్రా యూనిట్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు ఆడియన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ హీరో స్క్రీన్ ప్రజెంట్స్ కార్టూన్ క్యారెక్టర్ ను తలపించడంతో డైరెక్టర్ ఓం రౌత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 500 కోట్ల బడ్జెట్ పెట్టి వీడియో గేమ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏంటి అని ప్రశ్నిచారు..
కాగా మూవీ విజువల్ ఎఫెక్ట్స్ పై దారుణమైన ట్రోల్స్ రావడంతో బెటర్ అవుట్ పుట్ కోసం చిత్తాన్ని జనవరి నుంచి జూన్ కు వాయిదా వేశారు. ఇదిలా ఉంచితే తాజాగా తేజ సర్జా నటించిన ” హనుమాన్ ” టీజర్ రిలీజ్ అయింది. కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. విజువల్ ఎఫెక్ట్ పరంగా టాప్ మూవీగా ప్రేక్షకుల నుంచి ప్రశంశలు అందుకుంటోంది. ఆది పురుష్ తో పోలిస్తే 100 రెట్లు నయం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. దీంతో ఆదిపురుష్ లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి ” హనుమాన్ ” లాంటి చిన్న సినిమా విజువల్ ఎఫెక్ట్స్ లో సవాల్ గా నిలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ను టార్గెట్ చేస్తూ.. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోవాలని కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో ఆదిపురుష్ వర్సస్ హనుమాన్ అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. మరి టీజర్ తోనే ఆదిపురుష్ లాంటి బడా మూవీకి షాక్ ఇచ్చిన హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక ఇంకెలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
