Thursday, May 2, 2024
- Advertisement -

‘హంటర్’ రీమేక్ లో హీరోయిన్ తేజ‌స్వి

- Advertisement -
tejaswi madivada in hunter remake

తేజ‌స్వి.. మొదట్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా పేరు రాలేదు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ కి మరదలుగా నటించి మంచి గుర్తుంపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత మనం, హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, లవర్స్, అనుక్షణం, శ్రీమంతుడు, కేరింత.. రోజులు మారాయి వంటి సినిమాల్లో నటించింది ఈ భామ.

దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్లో వెంకీ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలో తేజ‌స్విఓ కీలక పాత్ర చేస్తోంది. ఇప్పుడు ఈ భామకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన  ‘హంటర్’ చిత్రం ను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో సెక్స్ అడిక్ట్ పాత్రను పోషిస్తున్నాడు శ్రీనివాస్ అవసరాల. ఈ సినిమా లో యాంకర్ శ్రీముఖి ఓ ఓ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పుడు తేజస్వి కూడా ఈ సినిమాలో చేరింది. ఈ సినిమా హిందీ వెర్షన్ లో ముగ్గురు హీరోయిన్లుంటారు. రాధికా ఆప్తే, సాయి తమ్ హంకర్, వీర సక్సేనా. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో వీర సక్సేనా చేసిన పాత్రను తేజస్వి చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా తేజస్వి వెల్లడించింది. ఈ సినిమాలో శ్రీముఖి. తేజస్వి కాకుండా మరో హీరోయిన్ కూడా వుంది. ఆ పాత్ర కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు.

Related

  1. పెళ్లి కాకుండా త‌ల్లి అయిన టాప్ హీరోయిన్స్!
  2. జగపతిబాబును కాపీ కొడతున్న హీరో
  3. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటున్న ప్రేమమ్ హీరోయిన్‌
  4. పవన్ కళ్యాణ్ కే నో చెప్పిన హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -