సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మహేష్.. మొదటిసారి ఉరమాస్ లుక్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్క యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మహేష్ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

కానీ ఈ మూవీలో మహేష్ ఎలా ఉండబోతున్నాడు అనే దానిపై ఇటీవల మహేష్ బాబు ఒక హింట్ ఇచ్చారు. బియార్డ్ లుక్ తో కాస్త రఫ్ గా ఉన్న లుక్ ను ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మహేష్.. ” లవ్వింగ్ న్యూ వైబ్ ” అంటూ రాసుకొచ్చారు. అయితే మహేష్ పోస్ట్ చేసిన ఆ పిక్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. దాంతో త్రివిక్రమ్ సినిమాలో మహేష్ ఎలా ఉండబోతున్నాడనే హింట్ ఇచ్చాడని సినివర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ యాక్షన్ మూవీ కావడంతో మహేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ట్రై చేయబోతున్నాడని వినికిడి. ఇది నిజమే అయితే మహేష్ ను త్రివిక్రమ్ ఊర మాస్ గా చూపించే అవకాశం ఉంది.

అయితే గతంలో ఎప్పుడు కూడా మహేష్ ఊర మాస్ లుక్ లో దర్శమనివలేదు. సర్కారు వారి పాట మూవీలో కాస్త రఫ్ లుక్ లో కనిపించినప్పటికి.. పెద్దగా లుక్ లో మార్పులేమీ కనిపించలేదు. కానీ త్రివిక్రమ్ సినిమాలో ” సాల్ట్ అండ్ పెప్పర్ ” లుక్ ట్రై చేస్తే తన కెరియర్ లోనే మొట్టమొదటి డిఫరెంట్ లుక్ అని చెప్పవచ్చు. మరి మహేష్ నిజంగానే త్రివిక్రమ్ సినిమాలో :” సాల్ట్ అండ్ పెప్పర్ ” లుక్ లో కనిపిస్తాడా ? లేదా రొటీన్ లుక్ లోనే దర్శనమిస్తాడా ? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Also Read

సలార్ పోస్టర్ రిలీజ్.. నిరాశలో ఫ్యాన్స్ !

మహేష్ – పవన్ ఫ్యాన్స్ మద్య మళ్ళీ మొదలైన రచ్చ !

రాజమౌళి టార్చర్ కు మహేష్ సిద్దమయ్యాడా ?

Related Articles

Most Populer

Recent Posts