Thursday, April 25, 2024
- Advertisement -

ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ.. తెరవెనుక తతంగం ఎవరిది ?

- Advertisement -

రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అందరికీ సుపరిచితమే. ఆయన రచించే వ్యూహాలు, ప్రత్యర్థులపై ఎత్తుకు పై ఎత్తులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏపీలో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహరచననే ప్రధాన కారణం అనేది జగమెరిగిన సత్యం. ఇక పశ్చిమ బెంగాల్ లో కూడా మమతా బెనర్జీ విజయంలో పీకే పాత్ర చాలానే ఉంది. ఈ విధంగా రాజకీయ పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు వ్యూహాలు రచించడంలో పీకే స్టైలే వేరు. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఒక పోలిటికల్ పార్టీతో బరిలోకి దిగితే ఎలా ఉంటుంది ? ఊహించుకోవడానికే సంచలనంగా ఉంది కదూ ! ప్రస్తుతం అలంటే చర్చే దేశ వ్యాప్తంగా ప్రధానంగా వినిపిస్తోంది.

ప్రశాంత్ కిషోర్ కొత్తగా పోలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు గత కొంతకాలంగా వినిపిస్తున్న మాటే.. ఆ విషయాన్ని పీకే కన్ఫర్మ్ చేశారు కూడా. అయితే ఆ పార్టీకి సంబంధించి కేవలం ప్రకటన తప్పా.. మిగిలిన విషయాలు ఏవి కూడా బయటకు రాలేదు. దీంతో పీకే పార్టీ ఉంటుందా ? ఉండదా అనే అనుమానాలు కూడా కొందరు విశ్లేషకులు వ్యక్తపరిచారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ పార్టీ కచ్చితంగా ఉండే అవకాశం ఉందట. ఎందుకంటే ” జన సురాత్ ” పేరుతో ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి అప్లికేషన్ చేరుకోవడంతో.. ఆ పార్టీ ప్రశాంత్ కిషోర్ దే నని జాతీయ మీడియా కోడై కుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.. ” జన సురాత్ ” పేరుతో ప్రజల్లోకి వెళ్తానని, ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి బిహార్ లో పాదయాత్ర మొదలు పెడతానని పీకే గతంలో చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పేరు ” జన సురాత్ ( సుపరిపాలన ) ” అయ్యే అవకాశం ఉంది.

ఇక ప్రశాంత్ కిషోర్ తన పార్టీని జాతీయ పార్టీగా విస్తరించే అవకాశం ఉంది ఎందుకంటే.. వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ దేశ ప్రజలకు బాగా తెలిసిన పేరు.. అందువల్ల తన పార్టీ ని పీకే జాతీయ పార్టీగా ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే వ్యూహ కర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పోలిటికల్ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి ? ఈ తతంగం అంతా నడిపిస్తున్న అజ్ఞాత నాయకుడు ఎవరు అనే ప్రశ్నలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే పీకే పార్టీ వెనుక కే‌సి‌ఆర్ హస్తం ఉందంటూ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ తరుపున వ్యూహకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడంలో కూడా పీకే పాత్ర గట్టిగానే ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా కే‌సి‌ఆర్ త్వరలోనే జాతీయ పార్టీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ పెట్టబోయే పార్టీ.. అంతర్లీనంగా కే‌సి‌ఆర్ ఆధీనంలోనే నడిచే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో ప్రధానంగా చర్చ జరుగుతోంది.

Also Read

మోడీని ఢీ కొట్టాలంటే.. అంతా ఈజీ కాదు !

మూడు రాజధానులు పక్కా.. తగ్గేదెలే !

“జగన్ కోచింగ్” అంటే అదే మరి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -