మెగాస్టార్ మూవీలో విలన్ అతడే..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న వరుస మూవీల్లో ఒకటి డైరెక్టర్ బాబీతో చేస్తున్న మెగా 154 సినిమా. వాల్తేరు వీరయ్యగా ఈ మూవీకి టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ చిరుకు తమ్ముడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి యాక్షన్ మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో చిరంజీవికి విలన్ గా తమిళ విలక్షణ నటుడు మాధవన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రంలోనూ మాధవన్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మాధవన్ మరోసారి విలన్ గా నటిస్తుండటం విశేషం.

- Advertisement -

పూర్తి మాస్ పాత్రలో చిరు కనిపిస్తుండగా .. పవర్ ఫుల్ విలన్ గా మాధవన్ అలరించనున్నారు. గతం బాబి వెంకీ మామ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు చిరుతో హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు మాధవన్ ఈ మూవీలో నటిస్తాడని అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

పవన్‌ కల్యాణ్‌తో సాయి ధరమ్ తేజ్

సినిమా చేయాలంటే.. ఓ కండీషన్ పెట్టిన మహేశ్

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -