ప్రేమికులు అఖిల్ అక్కినేని – శ్రీయాభూపాల్ రెడ్డిల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్యవర్తిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో అక్కినేని కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి.
నిజానికి అక్కినేని అఖిల్ శ్రీయాభూపాల్ ల వివాహం వచ్చే మే నెలలో ఘనంగా జరిపించాలని భావించారు. అయితే అనూహ్య రీతిలో వారి పెళ్లి రద్దయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అఖిల్ శ్రీయల మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలే వివాహ రద్దుకు.. కారణమనే వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, ఈ వార్తలపై ఇటు నాగార్జున, అటు శ్రీయాభూపాల్ కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదు. ఈనేపథ్యంలో అఖిల్ శ్రీయల మధ్య విభేదాలను తొలగించేందుకు రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.
జీవీకే ఫ్యామిలీకి ఉపాసన కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా శ్రీయకు, ఉపాసన క్లోజ్ ఫ్రెండ్ అందుకే అఖిల్ శ్రీయల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉపాసన ప్రయత్నిస్తోందట. ఎట్టకేలకు ఉపాసన రాయభారం ఫలించినట్టు, అఖిల్ శ్రీయ ఒక్కటవ్వబోతున్నారని వినికిడి.
{youtube}6DbJdtozeMI{/youtube}
Related