Thursday, May 2, 2024
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్షులుగా సోనియా, రాహుల్ ఉండరు..!

- Advertisement -
sonia and rahul won’t be presidents for congress party

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. ఆమె నేతృత్వంలో రెండు సార్లు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే ఓ పక్క ఆమెకు వయసు మీద పడుతోంది. అనారోగ్య కారణంగా చికిత్స కోసం అమెరికాకు కూడా వెళ్లి వచ్చారు.

ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలను ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీకి పూర్తిగా అప్పజెప్పాలని పలువురు పార్టీ సీనియర్ నాయకులు కోరుకుంటున్నారు. కానీ ఆమె ఆలోచన ఎలా ఉన్నప్పటికీ, అలా మాత్రం జరగలేదు. తాజాగా మరో ఏడాది పాటు సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో ఈసారి కూడా రాహుల్‌కు పూర్తి పార్టీ బాధ్యతలు లేనట్టే. 

 

కానీ ఏడాది తర్వాత మాత్రం కాంగ్రెస్ అధ్యక్షులుగా సోనియా ఉండకపోవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఓ పక్క పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాహుల్‌ పూర్తిస్థాయి క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేందుకు మాత్రం అయిష్టంగా ఉన్నట్టు చర్చలు నడుస్తాన్నాయి. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇంకెవరున్నారనేది అసలు విషయం. ఈ నేపథ్యంలో అటు ఏకె ఆంటోని వంటి మిస్టర్ క్లీన్ అని పిలవబడే కొందరు సీనియర్ నాయకుల పేర్లు తెర మీదకొస్తున్నాయి. ఇదిలా ఉంటే మరి రాహుల్ భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పొషించనున్నాడు? తన సోదరి ప్రియాంక గాంధీ పాత్ర ఏమిటనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -