Friday, March 29, 2024
- Advertisement -

దేశంలో ఒక్క‌రోజే 62,258 క‌రోనా కేసులు

- Advertisement -

దేశంలో క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తోంది. ఇదివ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపించిన క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. దీంతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టం ప్ర‌జ‌ల‌ను భయాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఒక్క‌రోజునే 62,258 పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డం దేశంలో క‌రోనా ఉధృతికి అద్ధంప‌డుతోంది.

శ‌నివారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వివ‌రాల ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో భారత్ 62,258 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఒకే రోజులో న‌మోదైన అత్య‌ధిక కేసులు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,08,910 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,52,647 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 1,12,95,023 మంది వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

దేశంలో కోవిడ్‌-19 మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. తాజాగా 291 మంది వైర‌స్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్త క‌రోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య 1,61,240కి పెరిగింది. దేశంలో న‌మోద‌వుతున్న క‌రోనా మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా మ‌హారాష్ట్రలోనే న‌మోద‌వుతున్నాయి. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 23,86,04,638 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్ ) వెల్ల‌డించింది.

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

సినీ వ‌ర్గాల‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్

మామిడితో బరువు పెరుగుతారా?

నోరూరించే హోళీ స్పెషల్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -