హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

- Advertisement -

రామ్ చ‌ర‌ణ్.. ప‌రిచ‌య‌మ‌క్క‌ర‌లేని పేరు. ఎందుకంటే తాను న‌టించిన సినిమాలు త‌క్కువే ఆయ‌న ఎన‌లేని క్రేజ్ ఆయ‌న సొంతం. ఈ మెగా పవ‌ర్ స్టార్ 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వ‌చ్చిన చిరుత సినిమాతో వెండితెర‌కు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. తన 12 ఏళ్ల కెరీర్ లో 12 సినిమాలు చేశాడు. ఇన్నేండ్ల‌లో తీసిన సినిమాలు త‌క్కువే ఆయ‌న‌ప్ప‌టికీ ఆ సినిమాలు ఆయ‌నకు ప్రత్యేక గుర్తింపును సంపాదించిపెట్టాయి.

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆర్ ఆర్ ఆర్ కంటే ముందు ఆయ‌న న‌టించి.. టాప్ పెర్ఫార్మన్స్ ను క‌నబ‌ర్చిన టాప్- చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టాప్‌-5లో మొద‌ట చెప్పుకోవాల్సిన మూవీ రంగ‌స్థ‌లం. ఈ సినిమాలో చిట్టిబాబుగా వినికిడి లోపం ఉన్న వ్యక్తి గా చ‌ర‌ణ్ న‌ట‌న ఓ రేంజ్‌లో ఉంటుంది. రెండోది ధృవ (2016). ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ పోలీసు పాత్ర‌లో భావోద్వేగ విలక్షణత, శారీరక, మాస్ యాక్ష‌న్ న‌ట‌న‌తో దుమ్మురేపాడు.

- Advertisement -

మూడోది మగధీర (2009). చ‌ర‌ణ్‌కు రెండో సినిమా ఇది. రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కాల భైర‌వుడు, హ‌ర్ష రెండు పాత్ర‌ల్లో మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చాడు. త‌ర్వాత చెప్పుకోవాల్సిన‌వి నాయ‌క్‌, ఎవ‌డు. ఈ రెండు చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ మాస్ యాక్ష‌న్ న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు. టాప్-5లో చివ‌రిదైన ఆరెంజ్ సినిమా చ‌ర‌ణ్ కెరియ‌ర్‌లో ప్లాప్ సినిమా అయిన‌ప్ప‌టికీ అందులో చ‌ర‌ణ్ ను ఇంత‌కు ముందు ఎప్పుడు చూడ‌ని పాత్ర‌లో క‌నిపించి, న‌టుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

దేశంలో ఒక్క‌రోజే 62,258 క‌రోనా కేసులు

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

సినీ వ‌ర్గాల‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్

మామిడితో బరువు పెరుగుతారా?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -

Latest News