Friday, April 26, 2024
- Advertisement -

ఏపీ లో కొత్త రూల్స్.. మంత్రి ఆదేశాలు జారీ..!

- Advertisement -

కొవిడ్ కేసులు వచ్చిన విద్యాసంస్థలు వెంటనే మూసేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్​ అన్నారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ స్థితిగతులపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ మళ్లీ పుంజుకుంటోందని.. 2 నెలలు జాగ్రత్త అవసరమని మంత్రి అన్నారు.

రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని తెలిపారు. కరోనా సోకిన వారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారాలు కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోనే పూర్తిస్థాయిలో తరగతుల నిర్వహిస్తున్నామని మంత్రి సురేశ్‌ అన్నారు. చర్యలు తీసుకోవడంతో అకడమిక్ క్యాలెండర్‌ గాడిలో పెట్టామన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ గుర్తుచేశారు.

వెంక‌టేష్-శేఖ‌ర్ క‌మ్ముల క్రేజీ మువీ !

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -