బిగ్ బాస్ లోకి సుడిగాలి సుధీర్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!

- Advertisement -

మా టీవీ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించగా.. సెకండ్ సీజన్ లో నాని, మూడు నాలుగు సీజన్లలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ ఐదో సీజన్ కూడా అతి త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ షో ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ షో లో పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్ లిస్ట్ కూడా బయటకు వచ్చింది.

అయితే ఈ సారి బిగ్ బాస్ షోలో ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ కూడా పాటిస్పేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ షోలో సుధీర్ పాటిస్పేట్ చేసేందుకు మా టీవీ యాజమాన్యం రూ.4.5 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ షోలో ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తిగా సుడిగాలి సుధీర్ నిలిచిపోనున్నాడు.

- Advertisement -

ఇప్పటికే సుధీర్ జబర్దస్త్ తో పాటు ఈటీవీ లో ప్రసారమయ్యే పలు ప్రోగ్రామ్ లకు యాంకర్ గాను ఉన్నాడు. జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్ ఫేమస్ కావడంతో అతడికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సుడిగాలి సుధీర్ ఎంట్రీ తో బిగ్ బాస్ షోకు మరింత ఆదరణ దక్కే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -