మహేష్ దూకుడు.. మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా..!

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ సినిమా డైరెక్టర్ సందీప్ వంగా ఒక్క సినిమాతోనే క్రేజీ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. అనంతరం సందీప్ తెలుగులో మహేష్ బాబు, చరణ్, విజయ్ దేవరకొండ లకు కథలు వినిపించారని వీరు ముగ్గురిలో లో ఒకరితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

అయితే సందీప్ తన తర్వాతి సినిమా కూడా హిందీలోనే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎనిమీ అనే హిందీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన తెలుగులో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయనున్నాడు.దీనికి సంబంధించి తాజాగా సందీప్ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబుతో తాను మూవీ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు.

- Advertisement -

ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నాడు. దీంతోపాటు రాజమౌళి సినిమా కూడా లైన్లో ఉంది. రాజమౌళి తన సినిమాకు కథను సిద్ధం చేసేందుకు చాలా సమయం తీసు కొంటాడు. రాజమౌళి త్వరగా కథ సిద్ధం చేస్తే ఆయన సినిమానే ముందుగా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒకవేళ కథ రెడీ అవడంలో ఆలస్యం జరిగితే సందీప్ వంగా సినిమానే ముందుగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -