Friday, May 10, 2024
- Advertisement -

నిహారిక సినిమా ఇప్పట్లో లేదట!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు సినిమా ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైయింది నిహారిక. ఇక ఇప్పట్లో సినిమా ఏది చేసే ఆలోచనలో లేదట నిహారిక. ముందుగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత తనకు అచ్చొచ్చిన బుల్లితెర పై మళ్ళీ సత్తా చాటాలని భావిస్తోందట.

ఒక మనసు చిత్రంపై నిహారిక మాత్రమే కాకుండా టోటల్ గా నాగబాబు కుటుంబమే షాక్ కి గురయ్యింది. దాంతో ఇపట్లో సినిమా గురించి ఆలోచించే సాహసం చేయడం లేదు.

అలాగే నిహారిక తో కూడా సినిమా చేసే సాహసం ఎవరు చేయడం లేదు. సినిమా హిట్ అయి ఉంటే కథ మరోలా ఉండేది కానీ ఘోర పరాజయం పొందడంతో పాటు మెగా హీరోలు ఎవరూ కనీసం ప్రచారం చేయకపోయినా సోషల్ మీడియాలో ట్వీట్ అయినా చేయకపోవడంతో జంకుతున్నారు. దాంతో మళ్ళీ బుల్లితెర వైపు చూస్తోందట నిహారిక.

Related

  1. అయ్యో…నిహారిక!!?
  2. నిహారిక సినిమాని కోసి పడేసారు
  3. నిహారిక మంచి మార్కులు కొట్టేసింది
  4. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -