ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి వంతపాడటం అధికారుల వంతు. ఇది సెంట్రలైనా,స్టేటైనా సర్వసాధారనం. అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే ఎక్కడ సమస్యలు వస్తాయే…. ఏఊరికి ట్రాన్స్పర్ అవుతారో తెలియదు. అందుకే అధికార పార్టీనాయకలకు భజన చేస్తుంటారు. వారిలో కొందరు అతి స్వామిభక్తి పరాయునులు ఉంటారు.
కానీ ఏపీలో అలా కాదు.. చిన్న స్థాయి అధికారలనుంచి కలెక్టర్ స్తాయి అధికారులవరకు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమేమికాదు. ముఖ్యంగా ప్రలకు జవాబుదారిగా ఉండాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారనేది అనేక సందర్భాల్లో బయట పడింది.ఇక జిల్లాల్లోని నియేజక వర్గాల్లో అయితే మరీ దారునం. ఏదైనా అధికార కార్యక్రమాలు జరుగుచున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారంబడి ఆనియేజకవర్గ ఎమ్మెల్యేను పిలవాలి. కానీ అధికార పార్టీ మెప్పుకోసం ప్రోటోకాల్‌ను తుంగలోకి తొక్కి అధికారపార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలకు ఆఖరికి వైసీపీ ఎమ్మెల్యేల చేతిలో ఓడిపోయిన నాయకులకు అధికారులు సహకరిస్తున్నారు.
చిన్నస్థాయి అధికారులంటే సహజం ,,, కానీ కలెక్టర్ స్థాయి అధికారి కూడా టీడీపీ ప్రజాప్రతి నిధులకు వంతపాడుతూ వారు చెప్పిందల్లా చేస్తూ… ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేల పట్ల చూపుతున్న వివక్షపై వైసీపీ ప్రజాప్రతినిధి గౌరు చరితా రెడ్డి కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.కర్నూలు జిల్లాలో ఏర్పడిన తాగు నీటి ఎద్దడి నివారనకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అధికారపార్టీ ఎమ్మెల్యేలు,టీడీపీ నియేజకవర్గ అధ్యక్షులను పిలిచి వైసీపీ ఎమ్మెల్యేలను పిలవకపోవడంతో …..వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందికోట్కూరు ఎమ్మెల్యేతోపాటు పాణ్యం ఎమ్మెల్యే గైరు చరితారెడ్డి కలెక్టర్ విజయమోహన్పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమ చేతిలో ఓడిపోయిన టీడీపీ నాయకులను పిలిచి మమ్మల్ను ఎందుకు జిల్లా సర్వసభ్యసమావేశానికి పిలవలేదని చరితా రెడ్డి ఉతికి ఆరేసింది. ఇంకేముంది సమాధానం చెప్పలేక నీల్లు నమలడం తప్ప సమాదానం చెప్పేదేముంది… ఇది మేము ఏర్పాటు చేసిందికాదని మంత్రి కేయీ కృష్నమూర్తి ఏర్పాటు చేశారని చల్లగా అక్యడనుంచి జారుకున్నారు. స్వామి భక్తి ఉండాలి గానీ మరీ ఇంత స్వామిభక్తి ఏంటనీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Related