Monday, June 17, 2024
- Advertisement -

చంపేస్తామంటు కిష‌న్‌రెడ్డికి పోన్ కాల్స్

- Advertisement -
Kishan Reddy receives threat calls

బీజేపీ తెలంగాణా నేత  కిష‌ణ్‌రెడ్డికి చంపేస్తామంటూ వ‌చ్చిన ఫో న్ కాల్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఉగ్ర‌వాదుల లిస్ట్‌లో కిష‌న్‌రెడ్డి ఉన్నాడ‌న్న సంగ‌తి తెలిసిందే.తాజాగా ఇప్పుడ వ‌రుసగా ఆర్ధాత్రి నుంచి ఆఫీస్‌కు,కిష‌న్‌రెడ్డి  ఫోన్ కాల్స్ రావ‌టంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.గ‌తంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఫోన్ కాల్స్ వ‌చ్చాయి.

ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు 12 శాతానికి పెంచుతూ తెలంగాణా స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్‌ల‌కు  ఆస్కారం క‌ల్పించ‌వ‌ద్ద‌ని బీజేపీ వాదిస్తుండ‌గా ….ఇది వెనుక‌బాటు సామాజిక ప‌ర‌మైన అంశ‌మేన‌ని ప్ర‌భుత్వం  వాదిస్తోంది.   ముస్లిం రిజర్వేషన్లపై ఆదివారం నాడు ప్రభుత్వం అసెంబ్లీని ఏర్పాటు చేయగా.. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు,ధ‌ర్నాలు తెలిపారున‌ దీంతో బీజేపీ తీరుపై విమర్శలు మొదలయ్యాయి. తాజాగా ఇదే కారణంతో కిషన్ రెడ్డికి బెదిరింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా చంపేస్తామని బెదిరిస్తూ రాత్రిపూట పలు ఫోన్ కాల్స్ రావడంతో నారాయణ గూడ, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

కిషన్ రెడ్డి ఫిర్యాదుపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు..బెదిరింపు ఫోన్ కాల్స్ షార్జా నుంచి వచ్చినట్లు గుర్తించారు. కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ ఆయన కార్యాలయానికి, నివాసానికి ఫోన్ కాల్స్ వస్తుండటంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.త‌గిన భ‌ద్ర‌త తీసుకుంటున్న‌ట్లు పోలీస‌లు తెలిపారు.

Also Read

  1. కేంద్రంతో కయ్యానికి కేసీ ఆర్ సై
  2. ఖ‌రీదైన కూలీ కేటీఆర్
  3. ప్ర‌శ్నించిన వారంతా అవినీతి ప‌రులేనా
  4. 2019 ఎన్నిక‌ల టార్గెట్ రెండు రాస్ట్రాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కోసం వేట సురూ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -