- Advertisement -

ఒంట‌రి పోర‌న్న‌ ప‌వ‌ణ్ మాట‌లు ఉత్తిత్తేనా టీడీపీ స్కెచ్‌లో భాగ‌మేనా

- Advertisement -
tdp new plan

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న ప‌వ‌ణ్ అనుకున్న‌ట్లుగానే ప‌వ‌ణ్ స్పందిస్తున్నాడు.. అదికూడా  ప్ర‌శ్నిస్తాన‌ని చెబుతూనే… మౌనంగా ఉండ‌టం… అప్ప‌డ‌ప‌పుడు ఏవో కొన్ని అంశాల‌మీద‌నే స్పందించ‌డం  అది కూడా ట్విట్ట‌ర్‌…. ఫేస్‌బుక్ల‌లో ట్వీట్‌ల‌తో స్పందించ‌డం చూస్తున్నాం. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ ,టీడీపీకీ మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌ణ్ క‌ళ్యాన్ ఆత‌ర్వాత ప్ర‌త్యేక‌హోదాపై యూట‌ర్న్ తీసుకోవ‌డంతో అప్ప‌టినుంచి దూరంగా ఉంటున్నారు.వ‌చ్చే సాధార‌న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని ఇప్ప‌టికే అనేక సార్లు ప‌వ‌ణ్ ప్ర‌క‌టించారు.

అయితే ఆమాటలు ఇప్పుడు ఉత్తుత్తేన‌ని తేలిపోయింది. దీనికి కార‌నం టీడీపీ మంత్రి ఒక‌రు చేసిన వ్యాఖ్య‌ల‌తో  ప‌వ‌ణ్ అస‌లు బండారం బ‌యట ప‌డింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లు  పవన్ చెబుతున్న మాటలకు భిన్నమైన పరిస్థితి ఉందన్నది ఏపీ విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగానే.. పవన్ వ్యవహరిస్తున్నారని.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలన్నీ బాబు ప్లాన్ లో భాగంగానేనన్న మాటను పలువురు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ తాజాగా ఏపీ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో జనసేన తమ పార్టీతో కలిసి పోటీ చేస్తుందని.. 2014లో ఏ రీతిలో అయితే.. టీడీపీ.. బీజేపీ.. జనసేనలు కలిసి పోటీ చేశాయో.. అదే రీతిలోనే 2019 ఎన్నికలు జరగనున్నట్లుగా చెప్పారు. కేంద్రంలోని బీజేపీతో టీడీపీ సయోధ్య సాగుతున్నదని.. రాష్ట్ర అభివృద్ధికి  ప్రధాని మోడీ సహకారం తప్పనిసరి అని చెప్పిన అయ్యన్నపాత్రుడు.. 2019 ఎన్నికల్లో బీజేపీ.. జనసేనలతో కలిసి టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తుందన్న వాదనను వినిపించారు.

అంద‌రి నేత‌ల మాదిరి కాకుండా కొస‌మెరుపుగా  ఆస‌క్తిక‌ర వ్య‌ఖ్య చేశారు అయ్య‌న్న‌పాత్రుడు. తాను చెప్తున్న మాట‌ల‌ను ఖ‌శ్చితంగా జ‌రుగుతుంద‌ని … ఎలాంటి సందేహాలకు తావు లేద‌న్నారు. కావాలంటే పేప‌ర్‌లో రాసిపెట్టుకోండ‌ని చెప్ప‌టం గ‌మ‌న‌ర్హం. అయ్య‌న్న పాత్రుడు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌ణ్ స్పందిస్తాడా లేక చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేస్తాడ‌నే చర్చ‌జ‌రుగుతోంది. ఇప్ప‌టిక వ‌ర‌కు ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో బీజేపీ మోసం చేసింద‌ని ప‌వ‌ణ్  చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు  తేలిపోయాన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయ్యన్న ఇంత ధీమాగా వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పవన్ మౌనంగా ఉంటే.. తప్పనిసరిగా అనుమానించాల్సిందే.

Related

  1. పార్టీ పై  చంద్ర‌బాబుకు పట్టు తప్పుతోందా…?
  2. టీడీపీ రౌడీఇజం… ప్ర‌జాస్వామ్యానికి చెప్పుదెబ్బ‌
  3. హైటెక్ బాబుకు జేసి సలహలా…!
  4. పార్టీ పై  చంద్ర‌బాబుకు పట్టు తప్పుతోందా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -