Monday, May 20, 2024
- Advertisement -

ఎంట్రీ ఫీజుతోనే మూడు వేల కోట్లు సంపాదించేలా ఉన్నారుగా..?

- Advertisement -

స్వాతంత్రోద్య‌మ‌కారుడైన‌ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఇటీవ‌లే చాలా ఘ‌నంగా ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందేప్ర‌పంచంలోనే అతి ఎత్తైన విగ్ర‌హాంగా రికార్డు సృష్టించిన ఈ విగ్ర‌హాంపై పెదవి విరుస్తున్నారు ప్ర‌జ‌లు.దీనికి కార‌ణం పటేల్ విగ్రహాన్ని చూసేందుకు నిర్ణ‌యించిన ధ‌రే. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చూసేందుకు వెయ్యి రూపాయల ఎక్స్‌ప్రెస్ ఎంట్రీని ఇటీవలే ప్రారంభించారు. దీనిపై పర్యాట‌కుల‌తో పాటు ,స్థానిక ప్ర‌జ‌లు సైతం ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.విగ్ర‌హానికి ఖ‌ర్చు పెట్టిన మూడు వేల కోట్లల‌ను ఎంట్రీ ఫీజు ద్వారానే సంపాదించేలా ఉన్నార‌ని వారు మండిప‌డుతున్నారు.

ఎంతో ఆశ‌గా ఈ విగ్ర‌హాం చూడ‌టానికి వ‌చ్చిన వారు ఎంట్రీ ఫీజు చూసి నిరాశ‌తో వెను తిరుగుతున్నారు.అక్టోబ‌ర్ 31న ప‌టేల్ విగ్ర‌హాం ఆవిష్క‌ర‌ణ జ‌ర‌గ్గా,నవంబరు 17న నుంచి ప‌టేల్ విగ్ర‌హాం చూసేందుకు అనుమ‌తినిచ్చారు.అయితే ప‌టేల్ విగ్ర‌హాన్నిఇప్ప‌టి వ‌ర‌కూ కేవలం 1749 మంది మాత్రమే వినియోగించుకున్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు డ్యామ్ సైట్ చూసేందుకు రూ. 350 టిక్కెట్ కూడా ఉంది. కాగా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ టిక్కెట్ తీసుకునే పర్యాటకులు పొడవాటి క్యూ లైన్లలో నిలుచోవాల్సిన అవసరం లేకుండా నేరుగా విగ్రహాన్ని సందర్శించవచ్చు. మ‌రి ప‌ర్యాట‌కుల నుంచి వ‌స్తున్న నిర‌స‌న చూసి అయిన ఎంట్రీ ఫీజును తగ్గిస్తారో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -