Sunday, April 28, 2024
- Advertisement -

బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ..తెలంగాణ నేతలకు ఛాన్స్!

- Advertisement -

ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉండగానే దూకుడు పెంచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్టీయే కూటమి టార్గెట్ 400గా ఇప్పటికే రాష్ట్రాల వారిగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక త్వరలోనే బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. ఈ లిస్ట్‌లోనే సగానికి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఇక తొలి లిస్ట్‌లో తెలంగాణ నేతలకు ఛాన్స్ దక్కనుంది. తెలంగాణకు చెందిన 8 నుండి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత లోక్ సభ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలిచిన సీట్లతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థులను ప్రకటిస్తే 50 రోజుల పాటు నిర్విరామంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇక తెలంగాణ నుండి ఫస్ట్ లిస్ట్‌లో ఛాన్స్ దక్కించుకునే వారి పేర్లను పరిశీలిస్తే..సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి, నిజామాబాద్ – అరవింద్, కరీంనగర్ – బండి సంజయ్ ఉండగా చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి – బూర నర్సయ్య గౌడ్,హైదరాబాద్ – మాధవీలత, మహబూబ్‌నగర్ – డీకే అరుణ, నాగర్ కర్నూల్ – భరత్ ప్రసాద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ లిస్ట్‌లో ముగ్గురు బీజేపీ సిట్టింగ్‌లకు ఛాన్స్ దక్కనుండగా ఆదిలాబాద్ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. మొత్తంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్‌పై ఆ పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -