Friday, May 17, 2024
- Advertisement -

విమానంలో ఘోరం…ఉపిరాడ‌క ప‌సికందు మృతి

- Advertisement -

సొంతూరులో తమ బంధువులను కలవబోతున్నామని ఎంతో ఆశతో స్వదేశంలో అడుగుపెట్టగానే ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మరికొన్ని గంటల్లో తమ ముద్దుల పాపను అందరికీ చూపించాలనుకోగా.. శ్వాస ఆడక ఆ బాలుడు చనిపోయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే…అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు.

కిత్స కోసం ఎయిర్‌పోర్టు పోలీసులు బాలుడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారికి శ్వాస ఆడక చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దంపతులు బోరున విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. విమానంలోనే బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

11 నెలల పసిబిడ్డ, అమెరికా సిటిజన్ షిప్ కూడా ఉన్న తమ కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉంది. అక్టోబర్ 18న ఆ బాలుడి పుట్టిన రోజు కూడా ఉంది. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -