Friday, April 26, 2024
- Advertisement -

ఆ చట్టానికి 224 మంది ప్రముఖులు మద్దతు..!

- Advertisement -

బలవంతపు మత మార్పిళ్లను నిషేధిస్తూ ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టానికి తాజాగా 224 మంది ప్రముఖులు మద్దతు పలికారు. ఆ చట్టం మహిళల గౌరవానికి రక్షణ కల్పిస్తుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై సంతకం చేసినవారిలో ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​, హరియాణాల మాజీ ప్రధాన కార్యదర్శులు యోగేంద్ర నరైన్​, సర్వేశ్​ కౌశల్, ధరంవీర్​లతోపాటు దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేంద్ర మేనన్, మాజీ రాయబారి లక్ష్మీపురి, మహారాష్ట్ర మాజీ డీజీపీ ప్రవీణ్ దీక్షిత్​ తదితరులున్నారు.

ఈ చట్టం ముస్లిములకు వ్యతిరేకమంటూ విమర్శిస్తున్నవారిని వారు తప్పుపట్టారు. “మైనార్టీలను రెచ్చగొట్టడం ద్వారా మత విద్వేషాలను రేపేందుకు వివక్షపూరిత సమూహం చేస్తున్న యత్నం” అని వారు వ్యాఖ్యానించారు. ఆ చట్టం అందరికీ వర్తిస్తుందని అన్నారు. ప్రతి చట్టాన్ని న్యాయ సమీక్ష చేసే రాజ్యాంగ అధికారాన్ని విమర్శకులు తమ సొంత అభిప్రాయాల కోసం స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. కాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్నిరోజుల క్రితం 104 మంది విశ్రాంత అధికారులు లేఖ రాసిన నేపథ్యంలో.. వీరు తాజా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

సీన్ రివర్స్..ద్రవిడ మున్నేట్ర కళగం కీలక నిర్ణయం..!

పాకిస్థాన్ లో మన ప్రసార భారతి టాప్.. భారీగా వృద్ధి..!

కేంద్రంతో పోరులో నేడు ఏడో విడత చర్చలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -