Saturday, April 27, 2024
- Advertisement -

భారతీయ శాస్త్రవేత్త ప్రియా సురేష్​ల పై సీబీఐ కేసు నమోదు..!

- Advertisement -

రాడార్ల ఉపకరణాల దిగుమతిలో అక్రమాలకు సంబంధించి భారత శాస్త్రవేత్త ప్రియా సురేష్‌తో పాటు అమెరికా సంస్థ అకాన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. 2009లో బెంగళూరులోని డిఫెన్స్‌ ఏవియొనిక్స్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌(డేర్)లో ప్రియా సురేష్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు కాలిఫోర్నియాలోని అకాన్‌ సంస్థతో కలసి మిలియన్‌ డాలర్ల(ఇప్పటి విలువ ప్రకారం రూ.7.3 కోట్లు) మేరకు అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

రాడార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్ యుద్ధ ఆయుధాల్లో ఉపయోగించే ఓల్టేజ్‌ కంట్రోల్డ్‌ ఆసిలేటర్‌(వీసీవో) ఆధారిత ఆర్‌ఎఫ్‌ జనరేటర్లను డేర్‌కు సరఫరా చేయడానికి అకాన్‌ టెండరు దక్కించుకుంది. 35 జనరేటర్లను సరఫరా చేయాలన్నది ఒప్పందం. ఇంకా ఉత్పత్తి దశలోనే ఉన్న జనరేటర్లను అకాన్‌ పంపింది. ఆ సంస్థ ప్రతినిధులు పంపిన ఈమెయిల్స్‌ ద్వారా ప్రియకు ఆ విషయం తెలిసినా వాటిని స్వీకరించడానికి ఆమె ఆమోదం తెలిపారని సీబీఐ పేర్కొంది.

సుప్రీంకోర్టులో ఖాళీలు.. ఎంత మందికి అవకాశం అంటే..!

ఆన్‌లైన్‌లో శిక్షణ మీకే కాదు.. మాకు కూడా అంటున్న ఉగ్రవాదులు..!

బార్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఫలించేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -