Friday, May 17, 2024
- Advertisement -

వారానికి 300 డాలర్ల ఆర్థిక సాయం..!

- Advertisement -

కరోనాతో అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్ధకు ఊతం ఇచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన 900 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ఈ ప్యాకేజీ కింద వారానికి 300 డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్న సంస్థలు సహా పాఠశాలలు, ఆరోగ్య సంస్థలకు సబ్సిడీలు ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కూడా ఈ ప్యాకేజీ కింద నిధులను వెచ్చించనున్నారు. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సాయం కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ ప్యాకేజీ ఎంతో మేలు చేస్తుందని రిపబ్లికన్‌ నేత మిచ్‌ మెకోనల్‌ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -