రెండు మూడు వారాల్లో పీక్ లెవల్ కు ఒమిక్రాన్

దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజు రోజుకూ పెరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా పాజిటివిటీ రేటు సైతం తగ్గడం లేదు. దేశంలో ప్రతి రోజు దాదాపు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. 16.16 శాతం పాజిటివిటీ రేటు ఉంది. తెలంగాణలో 3.6 శాతం, ఏపీలో 4 శాతానికి పైనే పాజటివిటీ రేటు నమోదవుతోంది.

ప్రస్తుతం ఒమిక్రాన్ అత్యంగా వేగంగా విస్తరిస్తున్న వైరస్ గా రికార్డులకెక్కింది. రానున్న రెండు వారాల్లో తెలుగు ఒమిక్రాన్ వేరియంట్ పీక్ స్థాయికి చేరుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి నాటి నుంచి తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.

కాగా ఒమిక్రాన్ కు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు స్ఫష్టం చేస్తున్నారు. సాధారణ జ్వరం, జలుబు మందులు వాడి తగ్గించవచ్చుని చెబుతున్నారు. కాగా ఒమిక్రాన్ సోకిన చిన్నపిల్లలకు ఏమీ కావడం లేదని, ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వ్యాక్సిన్, సామాజిక దూరం, మాస్క్ తోనే ఒమిక్రాన్ కు చెక్ పెట్టవచ్చునని స్ఫష్టం చేస్తున్నారు.

Also Read: తెలంగాణలో కర్ప్యూ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Related Articles

Most Populer

Recent Posts