Saturday, May 18, 2024
- Advertisement -

అవినీతికి కొమ్ముకాసే చంద్ర‌బాబుతో అవినీతి అంతం సాధ్య‌మేనా….?

- Advertisement -

అత్త‌మీద కోపం దుత్త మీద చూపిన‌ట్లు ఉంది ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీరు. కేంద్రంతో క‌టీఫ్ చెప్పాక త‌న బినామీల‌పై జ‌రిగిన ఐటి రెయిడ్స్ తో ఖంగుతిన్న చంద్ర‌బాబు సిబిఐ కి నో ఎంట్రి చెప్పారు. అవీనితి అంతం చేయాల‌నే ప‌దే ప‌దే చిల‌క‌ప‌లుకులు ప‌లికే చంద్ర‌బాబు సిబిఐకి నో చెప్పి ఏసిబిని కేంద్ర ఉద్యోగుల‌పై ఉసిగొల్ప‌డంతో పైకి క‌నిపించ‌ని అవినీతి చ‌క్ర‌వ‌ర్తులు చ‌ల్ల‌గా కేసుల నుంచి జారుకునే వీలును క‌ల్పించారు. మ‌చిలీప‌ట్నంలోని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ అధికారి కాళీ ర‌మ‌ణేశ్వ‌ర్ పై ఏసిబి కేస్ క‌ట్ట‌డ‌మే ఉదాహర‌ణ‌గా నిలుస్తోంది. దీంతో నేత‌ల మ‌ధ్య పోరు కాస్త సంస్థ‌ల మధ్య వార్ గా మారింది.

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోది, బిజేపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు త‌న‌పై కక్ష క‌ట్టి కేంద్ర సంస్థ‌ల‌ను ఉసిగొల్పుతున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తూ న‌వంబ‌ర్ 8వ తేది ఏపిలో సిబిఐ దాడులు జ‌ర‌ప‌డం…కేసు న‌మోదు చేసేందుకు ఇచ్చే జ‌న‌ర‌ల్ క‌న్సంట్ ను ర‌ద్దు చేశారు. దీంతో కేంద్రం వ‌ర్సెస్ ఏపి మ‌ధ్య లో పాల‌నావ్య‌వ‌స్థ‌లోని సంస్థ‌ల మ‌ధ్య వార్ గా మారుతోంది. మ‌చిలీప‌ట్నంకు చెందిన జ‌య‌ల‌క్ష్మీ స్టీల్స్ అండ్ సిమెంట్స్ కు చెందిన లోకేష్ ను సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ అధికారి కాళీ ర‌మ‌ణేశ్వ‌ర్ 50వేలు లంచం అడిగారు. దీనిపై న‌వంబ‌ర్ 28న విశాఖ‌లోని సిబిఐ ఆఫీస్ కు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన సిబిఐ ఏపి హోంశాఖ కార్య‌ద‌ర్శికి ఫిర్యాదు వివరాలు అందించి సిబిఐ దాడికి జ‌న‌ర‌ల్ క‌న్స‌ల్ట్ ఇవ్వాల‌ని కోర‌తూ వివ‌రాలపై గోప్య‌త పాటించాల‌ని కోరారు. అయితే చంద్ర‌బాబు స‌ర్కార్ నిబంధ‌ల‌ను గాలికి వ‌దిలి శుక్ర‌వారం 30వేలు లంచం తీసుకుంటుండ‌గా సిబిఐసి అధికారి కాళీ ర‌మ‌ణేశ్వ‌ర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించింది. దీనిపై పెద్ద దుమారం రేగుతోంది. స‌ర్కార్ లోని పెద్ద‌ల మొప్పు కోసం పోలీసులు ప్రాధ‌మిక నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడిచి ర‌మ‌ణేశ్వ‌ర్ ను అరస్ట్ చేయ‌డంప‌ట్ల అధికార‌వ‌ర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏ ఉద్యోగిపైనైనా ఫిర్యాదు వ‌చ్చిన‌ప్పుడు సంబంధిత శాఖ ఉన్న‌తాధికారి దృస్టికి తీసుకెళ్ళి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది…అయితే ర‌మ‌ణేశ్వ‌ర్ విస‌యంలో ఏపి కస్ట‌మ్స్ క‌మిష‌న‌ర్ అనుమ‌తి పొందాల్సి ఉండ‌గా అటువంటి ప్ర‌య‌త్నం ఏసిబి చేయ‌క‌పోవ‌డం విసేశం.

ఏసిబి తీరుపై సిబిఐ సీరియ‌స్ గా రియాక్ట్ అవుతూ పాల‌న‌లో అవినీతి అంతానికి కేంద్ర…రా ష్ట్ర సంస్థ‌ల మ‌ధ్య స‌హ‌కారం…న‌మ్మ‌కం అవ‌స‌ర‌మ‌ని పేర్కొంది. సంస్థ‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం…న‌మ్మ‌కం లేక‌పోతే లక్ష్యం దెబ్బ‌తింటుంద‌ని అధికార‌వ‌ర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాధార‌ణంగా ఫిర్యాదు రాగానే ఏసిబి ట్రాప్ చేసి అధికారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. అదే సిబిఐ అయితే ఫిర్యాదుపై కులంకుషంగా ద‌ర్యాప్తు జ‌రిగి ఈ కుట్ర‌లో ఎవ‌రెవ‌రు భాగ‌స్వాములు….ఫిర్యాదు దారుడు లంచం పేరిట ఏ మేర‌కు నిబంధ‌న‌లు ఉల్లంఘించారు…త‌దిత‌ర అంశాల‌ను పరిగ‌ణ‌లోకి తీసుకుని సంబంధిత అధికారితో పాటు కుట్ర‌లో పాలుపంచుకున్న ప్ర‌తిఒక్క‌రికి శిక్ష‌ ప‌డేలా ఫ్లాన్ చేసి దాడి చేస్తుంది. ఏసిబి ఇంత‌లోతుగా ద‌ర్యాప్తు చేయదు. దీంతో ఇచ్చేవాడు…తీసుకునే వాడే సీన్ లో మిగులుతారు. దీంతో కుట్ర‌లో భాగ‌స్వాములైన ఇత‌ర అధికారులు సులువుగా త‌ప్పుకుంటారు. దీనిపైన్నే సిబిఐ ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ప్ర‌భుత్వంపై న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది.

త‌న బినామీల‌పై ఐటి దాడులు జ‌రిగితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై దాడిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చిత్రీక‌రించిన తీరుపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. కేంద్రంలోని బిజేపి స‌ర్కార్ ను 2019లో గ‌ద్దె దించ‌కుంటే స్వ‌తంత్ర సంస్థ‌ల‌న్నీ భ్ర‌ష్టు ప‌ట్టిపోతాయ‌ని ఆరోపిస్తూ బిజేపియేత‌ర ప‌క్షాల‌ ఏకం కోసం కాలుకు బ‌ల‌పం క‌ట్టుకు తిరుగుతున్న చంద్ర‌బాబు నాయుడు సొంత రాష్ట్రంలో చేస్తున్న చేస్తున్న‌దేంట‌నే ప్ర‌శ్న కు ఆయ‌నే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -