Sunday, May 19, 2024
- Advertisement -

షాకింగ్‌.. ప్ర‌మాదంలో బ్యాంకుల ఆండ్రాయిడ్ యాప్‌లు..

- Advertisement -

బ్యాంకింగ్‌ యాప్స్‌ టార్గెట్‌గా మరో పెనుభూతం వచ్చింది. దాదాపు 232 బ్యాంకుల‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్‌లు ప్ర‌మాదంలో ప‌డ్డాయి. వీటి మీద ఓ మాల్‌వేర్ దాడి చేసింద‌ని ప్ర‌ముఖ యాంటీ వైర‌స్ సంస్థ క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్‌ వెల్ల‌డించింది. వీటిలో భార‌తీయ బ్యాంకుల‌కు సంబంధించిన యాప్‌లు కూడా ఉన్నాయ‌ని పేర్కొంది. ‘ఆండ్రాయిడ్‌.బ్యాంక‌ర్‌.ఏ9480’ అనే ట్రోజ‌న్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ సిస్టంలో ప్ర‌వేశించి యూజ‌ర్‌నేమ్‌లు, పాస్‌వ‌ర్డుల‌ను త‌స్క‌రిస్తోంద‌ని క్విక్ హీల్ వెల్ల‌డించింది.

థర్డ్‌పార్టీ స్టోర్ల ఫేక్‌ ఫ్లాష్‌ ప్లేయర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ9480 మాల్‌వేర్‌ విజృంభిస్తుందని క్విక్‌ హీల్‌ రిపోర్టు చేసింది. సైబర్‌క్రిమినల్స్‌కు ఫ్లాష్‌ ప్లేయర్‌ యాప్‌ చాలా పాపులర్‌ టార్గెట్‌. ఒక్కసారి యూజర్లు ఈ హానికర అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేస్తే, కనిపించని ఐకాన్‌ యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేస్తుంది.

అది టార్గెట్‌ చేసిన 232 బ్యాంకింగ్‌ యాప్స్‌కు సంబంధించి ఏ ఒక్క యాప్‌ను యూజర్లు చెక్‌ చేసుకున్నా.. ఆ హానికర యాప్‌ బ్యాంక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ యూజర్ల డేటాను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కీలక డేటాను దొంగలిస్తుందని క్విక్‌ హీల్‌ రిపోర్టు చేసింది

కేవ‌లం బ్యాంకింగ్ డేటా గురించి మాత్ర‌మే కాకుండా మెసేజ్‌లు, కాంటాక్టుల వివ‌రాల‌ను కూడా ఈ మాల్‌వేర్ తప్పు స‌ర్వ‌ర్ల‌కు చేర‌వేస్తుంద‌ట‌. అలాగే క్రిప్టోక‌రెన్సీ యాప్‌ల‌పై కూడా ఈ మాల్‌వేర్ దాడి చేస్తోంద‌ని క్విక్ హీల్ చెప్పింది. ఈ మాల్‌వేర్ బారిన ప‌డిన బ్యాంకు యాప్‌ల జాబితాను కూడా క్విక్ హీల్ విడుద‌ల చేసింది.

ఈ జాబితాలో యాక్సిస్ మొబైల్‌, హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ ఎనీవేర్ ప‌ర్స‌న‌ల్‌, ఐసీఐసీఐ వారి ఐమొబైల్‌, ఐడీబీఐ వారి గో మొబైల్‌, అభ‌య్‌, ఎం పాస్‌బుక్‌, బ‌రోడా బ్యాంక్, యూనియ‌న్ బ్యాంకుల యాప్‌లు కూడా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -