Friday, May 17, 2024
- Advertisement -

హజారే.. టీడీపీకి ఇంత చీప్ అయ్యాడా..!

- Advertisement -

అంతే ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా..! తెలుగుదేశం పార్టీ అన్నా హాజరే విషయంలో కూడా ఇదే పంథాను అనుసరిస్తోంది.

ఆయనను తక్కువ చేసి మాట్లాడుతోంది. గతంలో హజారే ను ఒక అద్భుత వ్యక్తిగా.. అనితరసాధ్యుడిగా చూసిన తెలుగుదేశం పార్టీ.. ‘హాజరే అయితే ఏంటి?’ అనేంత వరకూ వచ్చింది.

కాంగ్రెస్ హయాంలో.. బాబు ఏపీలో ప్రతిఫక్ష నేతగా ఉన్నప్పుడు.. ఢిల్లీలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటాన్ని మొదలు పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్లు బాగా హడావుడి చేశారు. బాబు అయితే హజారేకు మద్దతు అంటూ హైదరాబాద్ లో ఒక రోజు పాదయాత్ర నిర్వహించాడు. అన్నా హజారేకు అసలైన మద్దతుదారులం మేమే..అని బాబు అప్పట్లో చెప్పుకొన్నారు. 

అయితే అప్పుడు హజారేను దేవుడిలా చూసిన తెలుగుదేశం వాళ్లు ఇప్పుడు మాత్రం.. ఆయనను లైట్ తీసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో హజారే పర్యటించనున్నాడు.. అనే వార్తల నేపథ్యంలో తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగారు. హాజరేను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. “అంతా అయిపోయాకా.. హాజరే వచ్చి చేస్తారు?” అంటూ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వ్యాఖ్యానించాడు.

మరి అన్నా హజారే ఏదో లేఖ రాస్తే..దానికి సమాధానం చెప్పాల్సింది పోయి.. ఒకప్పుడు ఆయనను దేవుడు అన్న నోళ్లతోనే ఇప్పుడు ఇంత తక్కువ చేసి మాట్లాడతారా?! ఇది సబబేనా! అవసరం ఉంటే ఒకలా.. అడ్డం అవుతాడనుకొంటే మరేలా వ్యవహరించడం తెలుగుదేశానికి తగునా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -